Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
IPL 2026 : ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో గిల్ రుద్రతాండవం.. రజత్ పాటిదార్ రికార్డ్ బ్రేక్ చేసిన ప్రిన్స్

IPL 2026 : ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో గిల్ రుద్రతాండవం.. రజత్ పాటిదార్ రికార్డ్ బ్రేక్ చేసిన ప్రిన్స్

hmtv 1 week ago

shubman gill

shubman gill

IPL 2026 : ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్-2లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పరుగుల విధ్వంసం సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన చావో రేవో మ్యాచ్‌లో ఈ యంగ్ సెన్సేషన్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్‌తో చరిత్ర పుటల్లోకెక్కాడు.

ప్రత్యర్థి బౌలర్లను నలుమూలలా ఉతికేస్తూ కేవలం 47 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకొని క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన శతకం బాదిన ప్లేయర్‌గా గిల్ ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించాడు. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ రజత్ పాటిదార్ పేరిట ఉన్న రికార్డును గిల్ బద్దలు కొట్టాడు.

ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల్లో ఇప్పటివరకు అత్యంత వేగంగా సెంచరీ చేసిన రికార్డు రజత్ పాటిదార్ పేరిట ఉండేది. ఆయన గతంలో 49 బంతుల్లో సెంచరీ కొట్టగా.. ఇప్పుడు శుభ్‌మన్ గిల్ కేవలం 47 బంతుల్లోనే ఆ మార్కును దాటేసి సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గిల్ మొత్తం 53 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 104 పరుగుల వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. గుజరాత్ టైటాన్స్ జట్టు చరిత్రలోనే ఒక బ్యాటర్ సాధించిన అత్యంత వేగవంతమైన సెంచరీ కూడా ఇదే కావడం విశేషం.

ఐపీఎల్ క్రికెట్ చరిత్రలో ఒక కెప్టెన్‌గా ఉంటూ రెండు సెంచరీలు బాదిన మూడో భారతీయ ఆటగాడిగా గిల్ అరుదైన ఘనత సాధించాడు. అంతకుముందు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మాత్రమే ఈ ఘనత సాధించగా.. ఇప్పుడు ఆ లీగ్‌లోకి గిల్ చేరిపోయాడు. అంతేకాదు, ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచుల్లో రెండు శతకాలు బాదిన ప్రపంచంలోనే మొట్టమొదటి క్రికెటర్‌గా శుభ్‌మన్ గిల్ సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించాడు.

ఈ అద్భుత శతకంతో శుభ్‌మన్ గిల్ ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్‌లో 700 పరుగుల మైలురాయిని కూడా దాటేశాడు. ఇప్పటివరకు ఆడిన 15 మ్యాచుల్లో గిల్ 48.13 అద్భుతమైన యావరేజ్‌తో ఏకంగా 722 పరుగులు బోర్డుపై పెట్టాడు. ఈ సీజన్‌లో ఆయన బ్యాట్ నుంచి33 భారీ సిక్సర్లు, 72 క్లాసిక్ ఫోర్లు వచ్చాయి. ముఖ్యంగా ఈ పరుగులన్నింటినీ ఆయన 163 స్ట్రైక్ రేట్‌తో సాధించడం గిల్ ఫామ్‌కు నిదర్శనం.

ఈ మ్యాచ్‌లో గిల్ కేవలం వ్యక్తిగత రికార్డులే కాకుండా.. తన ఓపెనింగ్ పార్టనర్ సాయి సుదర్శన్‌తో కలిసి టీ20 క్రికెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రికార్డును క్రియేట్ చేశాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 13 ఓవర్లలోనే 167 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. అంతేకాదు, టీ20 క్రికెట్ చరిత్రలో గిల్-సుదర్శన్ జంటకు ఇది 11వ సెంచరీ భాగస్వామ్యం. ఈ క్రమంలో వారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐకానిక్ జోడీ విరాట్ కోహ్లీ - క్రిస్ గేల్ పేరిట ఉన్న పాత రికార్డును బద్దలు కొట్టారు.

ఐపీఎల్ కెరీర్‌లో గిల్ కొట్టిన 5 సెంచరీల ట్రాక్ రికార్డ్ ఇదే:

* మొదటి సెంచరీ (15 మే 2023): సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 101 పరుగులు.

* రెండో సెంచరీ (21 మే 2023): రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 104 నాటౌట్.

* మూడో సెంచరీ (26 మే 2023): ముంబై ఇండియన్స్‌పై 129 పరుగుల విధ్వంసం.

* నాలుగో సెంచరీ (10 మే 2024): చెన్నై సూపర్ కింగ్స్‌పై 104 పరుగులు.

* ఐదో సెంచరీ (29 మే 2026): క్వాలిఫైయర్-2 లో రాజస్థాన్ రాయల్స్‌పై 104 పరుగులు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu