Dailyhunt
IPL 2026 Playoffs: ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ రేస్.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు అవసరం?.. పూర్తి సమీకరణాలు ఇవే!

IPL 2026 Playoffs: ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ రేస్.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు అవసరం?.. పూర్తి సమీకరణాలు ఇవే!

hmtv 1 week ago

IPL 2026 Playoffs: ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ రేస్.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు అవసరం?.. పూర్తి సమీకరణాలు ఇవే!

IPL 2026 Playoffs: ఐపీఎల్ 2026 సీజన్ కీలక దశలోకి అడుగుపెట్టింది.

లీగ్ దశ ముగింపు దశకు చేరుతుండగా.. ప్రతి మ్యాచ్ ప్లే ఆఫ్స్ అవకాశాలపై ప్రభావం చూపనుంది. ఇక నుంచి ప్రతి మ్యాచ్.. ప్రతి జట్టుకు ఎంతో కీలకంగా మారనుంది. విజయం కోసమే టీమ్స్ బరిలోకి దిగుతాయి. ఇప్పటికే కొన్ని జట్లు ప్లే ఆఫ్స్ రేసులో బలమైన స్థితిలో ఉండగా.. మరికొన్ని జట్లు 'డూ ఆర్ డై' పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఏ నేపథ్యంలోప్లే ఆఫ్స్‌లోకి ప్రవేశించేందుకు ప్రతి జట్టుకు ఎన్ని విజయాలు అవసరమో ఇప్పుడు చూద్దాం.

ప్లే ఆఫ్స్‌కు దగ్గరలో ఆ నాలుగు టీమ్స్:

పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ప్లే ఆఫ్స్‌కు చాలా దగ్గరలో ఉన్నాయి. 13 పాయింట్లతో పంజాబ్ అగ్ర స్థానంలో ఉండగా.. మిగతా మూడు టీమ్స్ 12 పాయింట్లతో టాప్ 4లో ఉన్నాయి. పంజాబ్ తమ మిగిలిన 6 మ్యాచ్‌లలో కేవలం 2 విజయాలు సాధిస్తే చాలు.. టాప్-4లో చోటు దక్కించుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. హైదరాబాద్‌కు మిగిలిన 5 మ్యాచ్‌లలో 2 విజయాలు సాధిస్తే సరిపోతుంది. బెంగళూరు కూడా మిగిలిన 6 మ్యాచ్‌లలో 2 గెలిస్తే ప్లే ఆఫ్స్ దాదాపు ఖాయం అవుతుంది. రాజస్థాన్ కూడా మిగిలిన 5 మ్యాచ్‌లలో 2 గెలిస్తే టాప్-4లో స్థానం పొందే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.

గుజరాత్, చెన్నై, ఢిల్లీలకు అవకాశం:

ఐదవ స్థానములో ఉన్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి. ప్లే ఆఫ్స్‌లోకి రావాలంటే గుజరాత్ మిగిలిన 6 మ్యాచ్‌లలో కనీసం 4 విజయాలు సాధించాలి. 6, 7 స్థానాల్లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రెండు జట్లు మిగిలిన 6 మ్యాచ్‌లలో కనీసం 5 విజయాలు సాధించాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక మ్యాచ్ ఓడినా ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు ముగిసే ప్రమాదం ఉంది. ప్రస్తుత ఫామ్ చూస్తే.. అన్ని విజయాలు కష్టమే అని చెప్పాలి. చూడాలి మరి చెన్నై, ఢిల్లీ టీమ్స్ ఏదైనా అద్భుతాలు చేస్తాయేమో.

ఆ మూడు ఇంటికేనా?:

కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నాయి. ఈ మూడు జట్లకు ఇప్పుడు ఒక్క అవకాశం కూడా లేదు. మిగిలిన 6 మ్యాచ్‌లన్నింటినీ గెలిస్తే మాత్రమే.. ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. అంటే ఈ జట్లకు పూర్తిగా 'డూ ఆర్ డై' పరిస్థితి. వరుస ఓటములను ఎదుర్కొంటున్న కోల్‌కతా, ముంబై, లక్నో జట్లకు వరుస విజయాలు సాధించడం అంటే మాములు విషయం కాదు. దాదాపుగా ఇంటిదారి పెట్టినట్లే. ఏదేమైనా.. అభిమానులకు మాత్రం ఇకపై ప్రతి మ్యాచ్ హై వోల్టేజ్ థ్రిల్లర్‌గా మారనుంది. ఏ జట్లు చివరకు టాప్-4లో నిలుస్తాయో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu