Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Jagtial: హుండీ కానుకల వర్షం.. కొండగట్టు అంజన్న ఆలయానికి ఊహించని ఆదాయం!

Jagtial: హుండీ కానుకల వర్షం.. కొండగట్టు అంజన్న ఆలయానికి ఊహించని ఆదాయం!

hmtv 1 week ago

Jagtial: హుండీ కానుకల వర్షం.. కొండగట్టు అంజన్న ఆలయానికి ఊహించని ఆదాయం!

జగిత్యాల జిల్లా: మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయం రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలలో మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది.

2025-26 ఆర్థిక సంవత్సరంలో వివిధ రకాల సేవలు, ప్రత్యేక పూజలు, హుండీ కానుకల ద్వారా రూ.21.98 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుని రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలిచింది. ప్రతి మంగళవారం, శనివారం రోజుల్లో వేలాదిగా భక్తులు ఆలయానికి తరలివస్తుంటారు. ముఖ్యంగా స్వామివారికి జరిగే ప్రత్యేక పూజలు, మొక్కులు తీర్చుకునే భక్తుల రద్దీ కారణంగా ఆలయానికి గణనీయమైన ఆదాయం వస్తోంది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున కొండగట్టుకు చేరుకుంటున్నారు. అలాగే ఆలయంలో నిర్వహించే వివిధ ఆర్జిత సేవలు, వాహన పూజలు, తలనీలాల సమర్పణ, హుండీ కానుకలు దేవస్థాన ఆదాయాన్ని మరింత పెంచుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu