Dailyhunt
Jagtial: జగిత్యాలలో అగ్నిప్రళయం.. మక్కల లోడు లారీ మంటల్లో దగ్ధం!

Jagtial: జగిత్యాలలో అగ్నిప్రళయం.. మక్కల లోడు లారీ మంటల్లో దగ్ధం!

hmtv 1 week ago

Jagtial: జగిత్యాలలో అగ్నిప్రళయం.. మక్కల లోడు లారీ మంటల్లో దగ్ధం!

జగిత్యాల జిల్లా: కొడిమ్యాల మండలం దొంగల మర్రి స్టేజి వద్ద ప్రమాదం చోటుచేసుకుంది.

బాలపల్లి నుంచి చిన్న ముల్కనూరుకు మక్కల లోడుతో వెళ్తున్న లారీ అకస్మాత్తుగా ఇంజన్‌లో మంటలు చెలరేగడంతో పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఫైర్ ఇంజన్‌ను పిలిపించి అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం ఏమీ జరగలేదని సమాచారం. అయితే లారీ పూర్తిగా దగ్ధమవడంతో భారీ ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu