Jammikunta: జమ్మికుంటలో కిశోర బాలికల వైద్య శిబిరం ప్రారంభం
జమ్మికుంట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కిశోర బాలికలకు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరంను జమ్మికుంట పాత మున్సిపల్ కార్యాలయంలో ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ కిషోరా బాలికలకు మెప్మా,వావిలాల ప్రాథమిక వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్యులు చందన కిషోరా బాలికలకు పరీక్షలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి,డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ శ్రవణ్ కుమార్ లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ 15-18 సంవత్సరాలు ఉన్న కిషోరా బాలికలకు హిమోగ్లోబిన్, షుగర్ వంటి పరీక్షలు నిర్హించినట్లు వారు తెలిపారు. బాలికలు విధిగా పౌష్టికమైన ఆహారం తీసుకోవాలన్నారు. బాలికలకు ఎటువంటి సందేహాలు ఉన్న నేటి నుండి ఈ నెల 23వ తేదీ వరకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించి పరీక్షలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్తీ ఆఫీసర్ మొలుగు చందన హెల్త్ సూపర్ వైజర్ అరుణ, కొండపాక సదానందం హెల్త్ అసిస్టెంట్ నరేందర్, ఏ ఎన్ ఎం రాధ, మెప్మా సి.ఎల్.అర్పిలు జ్యోతి, అర్పిలు, ఆశ వర్కర్లతో పాటు కిషోరా బాలికలు పలువురు పాల్గొన్నారు.

