Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Jammikunta: రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మృతి

Jammikunta: రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మృతి

hmtv 1 week ago

Jammikunta: రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మృతి

మ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మహమ్మద్ సలీం(46) చికిత్స పొందుతూ మృతి చెందాడు.

మహమ్మద్ సలీం ఈనెల 4న, హుజురాబాద్ మండలం పెద్ద పాపయ్యపల్లి గ్రామము నుండి తన స్వగ్రామమైన ధర్మారం గ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా హుజురాబాద్ హైవే రాజపల్లి- తోకలపల్లి గ్రామాల మధ్య కారు సలీం ప్రవాహనాన్ని వెనుక నుండి వచ్చి ఢీ కొట్టింది. దీంతో సమీప బంధువులకు సమాచారం రావడంతో హుజురాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అక్కడనుండి జమ్మికుంట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యుల సూచన మేరకు వరంగల్ లోని అమృత న్యూరో కేర్ సెంటర్లో చికిత్స పొందాడు. ఇక్కడ పరిస్థితి విషమించడంతో వరంగల్ లోని ఎంజిఎం ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతులతో పోరాడి తుదిశ్వాస గురువారం మృతి చెందినాడు కాంగ్రెస్ పార్టీలో సలీం పాషా ఎన్ఎస్ యూఐ, యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలో చురుకైన నాయకునిగా పని చేసిన మంచి పేరు సంపాదించాడు. హుజురాబాద్ నియోజకవర్గమే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. సలీం తన రాజకీయ ప్రస్థానంలో ఇప్పటి వరకు ఏ పార్టీలో చేరకుండా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చాడు.

పట్టించుకోని అగ్ర నాయకులు సలీం దాదాపు 25 సంవత్సరాలుగా కాంగ్రెస్పార్టీలో.పనిచేస్తూ.వస్తున్నాడు. అయితే రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ ఒక్క అగ్ర నాయకుడు కూడా సలీంను పరామర్శించిన పాపాన పోలేదు. అయితే సలీం చికిత్స పొందుతున్న అప్పటి నుండి అతని సన్నిహితులు, స్నేహితులు మాత్రమే ప్రతినిత్యం యోగక్షేమాలను తెలుసుకుంటూ వచ్చారు.

ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుల నుండి స్పందన రాకపోవడంతో జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, హుజురాబాద్, హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు పారి విధాలుగా చర్చించుకుంటూ అగ్ర నాయకుల తీరుపై అసహన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఏ కార్యకర్తకు కానీ, ద్వితీయ శ్రేణి నాయకునికి కానీ ఇలాంటి సంఘటనలు జరిగితే ఎవరూ పట్టించుకోకపోతే తమ పరిస్థితి, కుటుంబాల పరిస్థితి ఏంటనిబహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu