Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జనసేనకు హైకోర్టులో చుక్కెదురు.. అత్యవసర విచారణకు నిరాకరించిన రిజిస్ట్రీ!

జనసేనకు హైకోర్టులో చుక్కెదురు.. అత్యవసర విచారణకు నిరాకరించిన రిజిస్ట్రీ!

hmtv 3 days ago

నసేనకు హైకోర్టులో చుక్కెదురు.. అత్యవసర విచారణకు నిరాకరించిన రిజిస్ట్రీ!

Telangana High Court: హైదరాబాద్‌లో బహిరంగ సమావేశం నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ జనసేన పార్టీ దాఖలు చేసిన హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు తిరస్కరించింది.

ఈ వ్యవహారంలో ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించగా, జనసేన న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే అక్కడ కూడా ఆ పార్టీకి నిరాశే ఎదురైంది.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని (Telangana Formation Day) పురస్కరించుకుని హైదరాబాద్ పరిధిలో భారీ సమావేశం నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ జనసేన పార్టీ ఇటీవల సైబరాబాద్‌ పోలీసులకు దరఖాస్తు చేసుకుంది. అయితే, శాంతిభద్రతలు, ట్రాఫిక్ సమస్యలు వంటి కొన్ని సాంకేతిక కారణాలను చూపిస్తూ పోలీసులు ఈ సమావేశ నిర్వహణకు అనుమతి ఇచ్చేందుకు నిరాకరించారు. పోలీసుల నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ జనసేన లీగల్ సెల్ ప్రతినిధులు హుటాహుటిన హైకోర్టులో హౌస్‌ మోషన్‌ (అత్యవసర) పిటిషన్‌ దాఖలు చేశారు.

జనసేన దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు రిజిస్ట్రీ.. దీనిపై అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ కింద విచారించాల్సినంత తీవ్రత (Urgency) ఈ అంశంలో లేదంటూ జనసేన దరఖాస్తును రిజిస్ట్రీ తిరస్కరించింది. దీంతో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ హైదరాబాద్‌లో సభ నిర్వహించి, రాజకీయంగా ఉనికి చాటాలనుకున్న తెలంగాణ జనసేన శ్రేణుల ప్రయత్నాలకు గట్టి బ్రేక్ పడినట్లయింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu