Jangaon: దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగించాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా!
జనగామ: జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో తొలి సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య 81వ వర్ధంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా దొడ్డి కొమురయ్య చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన గావించి, పూలమాలలు సమర్పించి, ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరవీరుడైన దొడ్డి కొమురయ్య నడయాడిన జనగామ జిల్లాలో పనిచేసే అవకాశం లభించడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు.
దొడ్డి కొమురయ్య స్ఫూర్తిని చిరస్థాయిగా నిలుపుకునేలా ఆయన పేరిట భవన నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన భూమిని ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలన్నారు.
ఈ నేపథ్యంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ మాట్లాడుతూ యువత దొడ్డి కొమురయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు.
అనంతరం మునిసిపల్ ఛైర్పర్సన్ మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ పోరాటంలో వెనుకబడిన తరగతుల కులాలకు అండగా నిలబడిన దొడ్డి కొమరయ్య మహోన్నత వ్యక్తి అని కొనియాడారు.
తదనంతరం డీసీసీ అధ్యక్షురాలు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల వారి అభ్యున్నతికి ఎంతగానో కృషి చేస్తోందన్నారు.
ఈ క్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య ఆశయాలైన సమానత్వం, సామాజిక న్యాయం ప్రజాస్వామ్య విలువలు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అదే విధంగా జనగామ మునిసిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి, అదనపు కలెక్టర్ రెవెన్యూ బెన్షాలోం ఆర్టీఏ సభ్యులు చిలువేరు అభి గౌడ్ కుల సంఘాల ప్రతినిధులు, సభ్యులు అధికారులు అందరూ దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహ రావు, విద్యా శాఖ ఏడీ శ్రీనివాస్ వైటిడిఎ సభ్యులు లక్ష్మి నారాయణ నాయక్ డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి సీనియర్ పాత్రికేయులు కన్నా పరశురాములు కురుమ సంఘం జిల్లా అధ్యక్షులు కంచె రాములు, పట్టణ అధ్యక్షులు బల్దే మల్లేశం, పట్టణ కార్యదర్శి జూకంటి శ్రీశైలం కోశాధికారి ఎండ్రు వైకుంఠం యాదవ సంఘం పట్టణ అధ్యక్షులు కానుగంటి ముత్తయ్య, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు వేముల బాలరాజు రజక సంఘం జిల్లా సెక్రటరీ ఎదునూరి మాదార్, కల్లు గీత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బల్దే వెంకట మల్లయ్య, కోపా అధ్యక్షులు కర్రే కృష్ణ జిల్లా కుమ్మర సంఘం అద్యక్షులు బుచ్చయ్య, అభినాష్, ఇతర కుల సంఘాల నాయకులు, జిల్లా అధికారులు ఐడిఒసి సిబ్బంది జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు...

