Jangaon: జనగామలో అన్నదాతల అగ్నిప్రేరణ జాతీయ రహదారిపై ధాన్యం పోసి నిప్పు
జనగామ జిల్లా: జనగామ మండలం పెంబర్తి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఐకేపీ కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం కాంటాలు వేసి రోజులు గడుస్తున్నా..
వాటిని మిల్లులకు తరలించడంలో అధికారులు, కాంట్రాక్టర్లు తీవ్ర జాప్యం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ పెంబర్తి రైతులు హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై (NH-163) రాస్తారోకో చేపట్టారు.
ధాన్యానికి నిప్పు పెట్టి నిరసనకొనుగోలు కేంద్రాల వద్ద లారీల కొరత కారణంగా వేలాది బస్తాల ధాన్యం ఎక్కడికక్కడే పేరుకుపోయిందని, అకాల వర్షాల భయంతో తాము నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దలు, అధికారులు స్పందించి వెంటనే లారీలను పంపించి ధాన్యాన్ని తరలించాలని డిమాండ్ చేస్తూ.. రైతులు ఆగ్రహంతో రహదారిపై ధాన్యాన్ని పోసి నిప్పు పెట్టారు నిలిచిపోయిన ట్రాఫిక్రైతులు జాతీయ రహదారిపై బైఠాయించి, ధాన్యం బస్తాలను రోడ్డుకు అడ్డంగా వేయడంతో ఇరువైపులా వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మరియు సివిల్ సప్లై అధికారులు రైతులతో చర్చలు జరుపుతున్నారు. వెంటనే లారీలను సమకూర్చి ధాన్యం లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు భీష్మించుకు కూర్చున్నారు.

