Jangaon: జంగామ కలెక్టర్‌ను కలిసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
జనగామ: ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల క్రితం మానకొండయ్య గుట్ట తవ్వకాలు గతంలో పర్మిషన్ ఇచ్చింది వాస్తవం.
నేను గత కలెక్టర్ కి పిర్యాదు చేసి పర్మిషన్ లేదు అని తవ్వకాలు ఆపివేయడం జరిగింది. ఈ రోజు పర్మిషన్ వచ్చింది అని తవ్వకాలు మొదలు పెట్టారు ఎట్టి పరిస్థితుల్లో తవ్వకాలు ఆపాలి. వాళ్ళు ఎన్ని పర్మిషన్ లు తెచ్చిన గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా పనులు మొదలు పెట్టొద్దు.
సానుకూలంగా స్పందించిన కలెక్టర్ వెంటనే ఆపేస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది. వడ్ల కొనుగోలు ప్రభుత్వం లేట్ చేయడం వల్ల 60 శాతం రైతులు ప్రైవేట్ కి అమ్ముకోవడం జరిగింది నెలల తరబడి ఎదురుచూస్తున్న ఇంకా కొనుగోలు చేయడం లేదు. పాలకుర్తి నియోజకవర్గం లో పెండింగ్ లో ఉన్న పలు అభివృద్ధి పనులు చేయాలని కలెక్టర్ కి కోరడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేసిన పనులు చేయడానికి కూడా శక్తి లేదు రాష్ట్రంలో నీళ్లు , యూరియా , రైతుబంధు , చివరకి వడ్లు మక్కలు అమ్ముకోవడానికి రైతు ఎదురుచూస్తున్నాడు ఇంతటి ఘోరమైన పరిస్థితి 40 ఏళ్లలో ఇలాంటి వరస్ట్ ప్రభుత్వాన్ని ఎక్కడ చూడలేదు అన్నారు.

