Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Jangaon: మద్యం విక్రయిస్తే 50 వేల ఫైన్.. గ్రామంలో సంచలన తీర్మానం!

Jangaon: మద్యం విక్రయిస్తే 50 వేల ఫైన్.. గ్రామంలో సంచలన తీర్మానం!

hmtv 2 days ago

Jangaon: మద్యం విక్రయిస్తే 50 వేల ఫైన్.. గ్రామంలో సంచలన తీర్మానం!

Jangaon: సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తూ ఓ గ్రామంలో సర్పంచ్ ఏకగ్రీవ తీర్మానం చేశారు.

మద్యం విక్రయిస్తే జరిమానాతో పాటు కొన్ని షరతులు విధించారు. దీంతో ఆ గ్రామం మార్పు దిశగా ముందుకెళ్తుంది. జనగామ జిల్లా చిల్పూర్ మండలం నష్కల్ గ్రామానికి చెందిన సర్పంచ్. సర్పంచ్ గా ఎన్నికైనప్పటినుండి గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్నాడు. గ్రామంలో విచ్చలవిడిగా వెలిసిన బెల్ట్ షాపుల వల్ల, ఎన్నో కుటుంబాల బ్రతుకులు చిన్నాభిన్నమవుతూ, రోడ్డున పడుతున్నాయని గమనించిన సర్పంచ్ గ్రామ పెద్దలు, మహిళలు, గ్రామపంచాయతీ పాలకవర్గం కలిసి సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.

గ్రామపంచాయతీ పాలకవర్గం చేసిన తీర్మానాన్ని కాదని గ్రామంలో అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే 50వేల జరిమానా తో పాటు వారి ఇంటి నల్ల కనెక్షన్, కరెంట్ కనెక్షన్, రేషన్ కార్డు లను రద్దు చేస్తామని హెచ్చరించారు. గ్రామంలో మద్యం సేవించి చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయని, అందుకే గ్రామ ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి మద్యం, బెల్ట్ షాపులను నిషేధించాలని గ్రామసభలో ఏకగ్రీవ తీర్మానం చేశామన్నారు. ఈ నిర్ణయం పట్ల మహిళలు వర్షం వ్యక్తం చేశారు. సామాజిక మార్పు అనేది నినాదాల వల్ల రాదని, గట్టి సంకల్పంతో వస్తుందని నిరూపించారు ఆ గ్రామ సర్పంచ్.

సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేసి సామాజిక మార్పులో ఈ గ్రామం ఆదర్శంగా నిలుస్తుంది. ఇప్పుడు గ్రామంలో యువత చెడు దోవ పట్టకుండా ఎవరి పనులు వారు చేసుకుంటున్నారని, గ్రామంలో ఎలాంటి గొడవలు జరగడం లేదని మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. దీన్ని కఠినంగా అమలు చేస్తేనే మద్యం మహమ్మారి జోలికి ఎవరు వెళ్లొద్దని, అనారోగ్యం పాలయ్యి రోడ్డు పాలు కావద్దని కోరారు. రాత్రి వేళల్లో గొడవలకు, అసాంఘిక కార్యకలాపాలకు బెల్ట్ షాపులు అడ్డాలుగా ఉండేవని, వీటివల్ల ముఖ్యంగా యువతపై చెడు ప్రభావం పడేది అన్నారు.

తమ చుట్టుపక్కల గ్రామాలు కూడా తమ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని వారు కూడా మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో మద్యం వల్ల చాలా కుటుంబాల బ్రతుకులు చితికిపోయాయని, మద్యం తాగి తాగి ఇంటి యజమాని చనిపోవడంతో కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గ్రామస్తులు అంత ఏకతాటి పైకి వచ్చి మద్యపాన రహిత గ్రామంగా తీర్చిదిద్దడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వెలిబుచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu