Jangaon: పటేల్‌గూడెంలో కలెక్టర్ సందీప్ కుమార్ తనిఖీలు!
జనగామ: పటేల్గూడెం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ లింగాల గణపురం మండలం పటేల్గూడెం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అకాల వర్షాల నేపథ్యంలో రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. తూకం, కొనుగోలు, ఓపీఎంఎస్ నమోదు ప్రక్రియలను పరిశీలించిన కలెక్టర్, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించి రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.

