Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Jayashankar: మాజీ ఎంపీ వినోద్ కుమార్‌కు రాఖీ కట్టిన గండ్ర జ్యోతి!

Jayashankar: మాజీ ఎంపీ వినోద్ కుమార్‌కు రాఖీ కట్టిన గండ్ర జ్యోతి!

hmtv 59 mins ago

Jayashankar: మాజీ ఎంపీ వినోద్ కుమార్‌కు రాఖీ కట్టిన గండ్ర జ్యోతి!

Jayashankar: అన్నా-చెల్లెల ప్రేమకు, ఆప్యాయతకు ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ వేడుకల్లో భాగంగా జయశంకర్ జిల్లా brs పార్టీ కార్యాలయం లో మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్‌కు వరంగల్ జిల్లా జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్, భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఇరువురు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ రాఖీ పండుగ విశిష్టతను గుర్తు చేసుకున్నారు. కుటుంబ బంధాలను మరింత బలపరిచే ఈ పండుగ సమాజంలో ప్రేమ, అనుబంధం, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.

అన్నా-చెల్లెల మధ్య అనురాగానికి ప్రతీకగా సాగిన ఈ వేడుకల్లో ఆత్మీయత వెల్లివిరిసింది. రాఖీ పండుగ సందేశాన్ని ప్రతిబింబించేలా సోదర భావాన్ని చాటుకున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu