Dailyhunt
Jordar News: లంచం ఇవ్వలేదని.. ఈ పోలీస్ ఏం చేసిండో మీరే చూడండి

Jordar News: లంచం ఇవ్వలేదని.. ఈ పోలీస్ ఏం చేసిండో మీరే చూడండి

hmtv 1 week ago

Jordar News: లంచం ఇవ్వలేదని.. ఈ పోలీస్ ఏం చేసిండో మీరే చూడండి

Jordar News: ఆడే కాలు, పాడే నోరు ఉత్తగుండయంటరు.. అట్లనే లంచానికి అట్వాటు పడ్డొల్లు గుడ లంచం పుచ్చుకోంది ఉత్తగుండరు గావచ్చుల్ల ఇగో ‎ఈ పోలీస్ లెక్క.

ఇంతకేం జేశిండీ ఖాకీ అనంటరా. రూల్సు ప్రకారం చెక్ పోస్ట్ కాడ లోడు లారీని చెకింగు జేశిండు.. ఏం తక్లీబు లేకున్నా లంచం అడిగిండు. కని, లారీ డ్రైవర్ లంచం ఇయ్యలె, గంతే ఈగో దెబ్బతిని పగవట్టినట్టే జేశిండు. చెకింగు పేరిట ఇనుప సీకు కుచ్చి లోడ్ లారీల ఉన్న సంచులకు రంధ్రాలు జేశిండు. చెకింగు పేరుతోటి సంచులను శింపుతాండని డ్రైవరన్న వీడియో తీత్తాంటె గుడ తీస్కో అన్నట్టే చేసిండు. లంచం ఇయ్యలేదని ఎంత కండ్లమంట తనమున్నది సూడుర్రి ఈ పోలీస్కు. పోలీస్ వృత్తికే మాయని మచ్చ తెచ్చిండు గదా. ఎక్కడ జర్గిందో తెల్వదని గనుల్ల.. సోషల్ మీడియాల మస్తు వైరల్ ఐతాంది ఈ పోలీస్ చేసిన పాడు పని. పబ్లిక్కు గుడ కర్రుగాల్శి వాత పెట్టినట్టు మంచిగ అర్సుకుంటార్రు వీన్ని కామెంట్లు పెట్టి. నంబర్ వన్ పోలీస్ అని కొందరు ఎడ్డిస్తుంటె, బిచ్చగానికి వంద రూపాలిత్తె పోతడని ఇంకొందరు.. ఈ లంచగొండి ఆఫీసరు ఇజ్జత్ మొత్తం తీస్తున్నరు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu