Jordar News: సడన్ గా చూసి మోదీ సార్ అనుకున్నాను
Jordar News: అగో ఎవ్వలనో సూపెడ్తమని జెప్పి పీఎం మోడీ సారును సూపెడ్తారేందుల్లా అని అనుకుంటే మీరు పప్పుల కాలేసినట్టే.
ఎందుకంటె గీడ కానోస్తున్నది మోడీ సారు కానే కాదువట్టి. అగో మరింకెవ్వలు అనంటరా.. హీరోలకు డూపు లెక్క మోడీ సారుకు డూపు అసోంటాయినోల్ల గీనే. మురారీ కళాకారుడట ఈ కాకా. పేరు వికాస్ మహంతే. ఉండేది మహారాష్ట్ర రాష్ట్రం. అచ్చం మోడీ సారు లెక్కుండేటాళ్లకు ఎప్పటినుంచో మస్తు ఫేమస్ ఈ కాకా.

