Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Jordar News: తాత ఎనర్జీ చూసి నెటిజన్లు ఫిదా

Jordar News: తాత ఎనర్జీ చూసి నెటిజన్లు ఫిదా

hmtv 2 days ago

Jordar News: తాత ఎనర్జీ చూసి నెటిజన్లు ఫిదా

Jordar News: : ఓదిక్కు హార్వెస్టర్ పొలాన్ని కోస్తుంటే ఇంకోదిక్కు రైతన్న పడ్తున్న ఆనందం మామూలుగ లేదు గదా.

పొలం కోత అయితుంటెనే ఉరికి ఉరికి దొమ్మరిగడ్డలేస్తున్నడు. నేలకు తాకుతె దెబ్బలు తాకుతయన్న భాద గుడ లేకుంట పంట మంచిగ పండిందన్న ఆనందంతోని పరవశించిపోతున్నడీ రైతన్న. ఈ రైతు పేరు మల్లయ్య. మహబూబ్‍ నగర్‍ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్‍ ఊళ్లుంటడు. ఈ పెద్దమన్షి 30 గుంటలల్ల వరిసాగు జేశిండట. ఎన్నడు లేంది ఈయేడు పంట దిగుబడి ఎక్కో అచ్చిందట. గందుకే ఓ దిక్కు మిషిని కోస్తుంటెనే ఆనందం పట్టలేక పోలంల గంతులేశిండట. అంతేనానే పెద్దమన్షి

ఇన్నరు గదా.. కోటి రూపాలున్నా రాని ఆనందం భూతల్లి సక్కని పంటనిచ్చిప్పుడు అస్తదట. గందుకే పంట దిగిబడిని సూశి ఇట్ల భూతల్లిని ముద్దాడిండన్నట్టు. ఈ మల్లయ్య పొలంల గెంతులేస్తుంటే సుట్టుముట్టున్న రైతులు సుతం పర్శానై దగ్గరకచ్చి సూశి వీడియోలు తీసి సోషల్ మీడియాల పెట్టేటాళ్లకు ఈ తాత ఓవర్ నైట్ స్టార్ అయిపోయిండు. ఓదిక్కు వైసు మీదవడ్డా భూతల్లిని నమ్ముకోని పంటవండిచ్చిన రైతన్న పంట మంచిగ పండుతె ఎంత సంతోషపడ్తడో దీన్ని వట్టే అర్థమైతున్నదనుకుంట కామెంట్లు జేస్కుంట మస్తు వైరల్ జేస్తున్నరీ వీడియోను. ఈ రైతన్న పంటదిగుబడి ఎక్కో అచ్చినందుకు మస్తు సంతోషపడ్తే ఇంకో దిక్కు ఇదే రైతులు పండిచ్చిన పంట రోజులు, వారాలు, నెలలు గడ్శినా కొనే దిక్కు లేదని కొందరు రోడ్డెక్కుతే., ఇంకొందరు ఆ ధాన్యానికి నిప్పు వెట్టిన వార్తలు సుతం మన జోర్దార్ల జెప్పున్నం. కనీ., అందరి లెక్కగాదుల్లా రైతులు. శానా అల్ప సంతోషులుంటరు శానా మంది రైతులు. ఏ శిన్న సాయం జేశ్నా అస్సల్కే మర్శిపోరు రైతన్నలు. అసొంటి రైతన్నలు మాత్రం నేడు అరిగోసవడే పరిస్థితులు మోపైతున్నయి మన దేశంల. మరి సర్కార్ పెద్దలు, రాజకీయం లీడర్లు జెప్పినట్టు రైతులు ఎప్పుడు రాజులైతరో ఏందో పోండ్రి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu