Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Jordar News: వకీల్ సాబ్ కు చుక్కలు చూపించిన కోతి..

Jordar News: వకీల్ సాబ్ కు చుక్కలు చూపించిన కోతి..

hmtv 3 weeks ago

Jordar News: వకీల్ సాబ్ కు చుక్కలు చూపించిన కోతి..

Jordar News: అగో.. వానరాలన్నరు. గీన్నేమో.. మన్షులు ఎర్రటి ఎండల ఒక్క తీర్గ తిప్పలు వడ్తున్నరని గరానికి రాకుర్రుల్లా.

కరెన్సీ నోట్ల మీద మన్షులు ఇంత మమకారం సూపెట్టెతట్టు జేశింది గీ శెట్టుమీదున్న వానరమేనుల్లా. అగో అదెట్ల అనంటరా. ఉత్తర్ ప్రదేశ్ రాష్టం బులంద్ షహర్ కాడున్న జిల్లా కోర్టుల ఒగ వకీల్ సాబ్ శేతి సంచిల పైసలు పెట్టుకొని నడ్సుకుంట పోతున్నడట. ఇగ ఒక్కటే పారి మీద వడి సంచినెత్కపోయింది వానరం. ఇగ సూడుర్రి దాని తమాషా. కల్లుతాగకముందే తాగినట్టు జేశింది. సంచిని పర్రపర్ర శింపి కిందున్నోల్ల మీద కోతి నోట్ల వానకురిపిచ్చింది. కిందిన్నోల్లు పిల్శినప్పుడల్లా.. ఒక్కొక్క కట్ట ఇస్రుకుంట వకీల్ సాబ్కు సిన్మా సూపెట్టింది.

పాపం.. వకీలన్న, చేశేదేం లేక. కింద పడ్డ నోట్లను ఏరుకొని జేబుల వెట్టుకున్నడు. వకీల్ సాబ్ ఏ ఉటావో అనుకుంట కింద పడ్డనోట్లను సుట్టుముట్టోల్లు సూపెడ్తుంటే.. ఒక్కొక్క నోటును ఏరుకున్నడు. పోలీసోల్లు సుతం అక్కడికి జేరి అన్ని పైసలను ఎద్రిచ్చిర్రు. వకీల్ సాబ్ రెండు లక్షలు పట్కపోయిండట కని, అటీటు పోంగ దొర్కినయైతే లక్ష తొంబయోక్కవేలేనట. తతిమ 9 వేలు కోతి ఖాతాల పడ్డయ్. మంకీ ట్యాక్స్ కింద కట్టైపోయ్నయని అక్కడున్నోల్లు ఎడ్డియ్యవట్టిర్రు. కనీ.. ఇయ్యాల్రేపు నెరీ అద్వానం తయారైనయుల్లా కోతులు. కోతులు ఇట్లనే ఊర్లల్ల మకాం పెడ్తే.. మన్షులు ఊర్లు కాళీ జేశి, పచ్చటి జంగల్లకు పారిపోవాల్శొస్తది కావచ్చు పోర్రి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu