Jordar News: వీడియో తియ్యకపోతే.. ఎవ్వరు నమ్మరు
Jordar News: ఉత్తర్ ప్రదేశ్ దిక్కు 19 జిల్లాలను గాలివాన అడివెట్టి సుడివెట్టిందుల్లా. మూన్నాలుగు రోజుల సుంది ఇడ్వకుంట పిడుగులు, గాలిదుమారం, వాన పగవట్టినట్టు జెయ్యంగ 127 మంది జీవిడ్శిర్రు.
వందల పాడిపశువులు ఆగమైనయ్. ఏడికాడ శెట్లు నేలకు రాలినయ్. వంద దాంక ఇండ్లు ఇచ్చుకపోయ్నయ్. బరేలీ కాడ సూడుర్రి రేకుల శెడ్డు గాలిల ఎట్లలేశిందో.
పాపంపాడుగాను.. హాలీవుడ్ సిన్మాల హీరోలెక్కనే గాల్లె ఎగ్రిండు గదా అన్న. అటు దిక్కుండే నన్నేమియా అనే గీ అన్న. ఆయ్న ఇంటిముంగటవెట్టిన రేకుల షెడ్డు గాలికి ఎగ్రిపోవద్దని తాడు కడ్తున్నడట. ఇగ అంతల్నే గాలి ఇంకింత రువ్వడిగచ్చి రేకుల షెడ్డును అమాంతం లేపింది. ఈ అన్న సుతం తాడును అట్లనే పట్టుకొని గాలిలకు 50 ఫీట్ల ఎత్తుకు ఎగ్రి, 3వందల మీటర్ల దూరంలున్న మక్కశేన్ల వడ్డడు. ఈ రియల్ స్టంట్ వీడియోలల్ల సూశ్నోల్లు.. ముందుగాల ఏఐ మాయనా అని మస్తు పర్శానైర్రు. అటెంక అసలు ముచ్చట తెల్శి నోర్లు తెర్శిర్రు. ఈనె నశివ మంచిగుండి పానాలకు పెద్దగ ప్రమాదం ఏంకాలేదు. రెక్క శిన్నగ ఇర్గినట్టైందట. ఎంబటే దావఖాన్కు ఏస్కపోయిర్రు సుట్టుముట్టున్నోల్లు. ఇగట్లనే గాలిదుమారానికి శెట్లు కూలి కార్లు, బండ్లు మీద వడ్తె తుక్కుతుక్కైనయ్.

