Dailyhunt
Jordar Varthalu: ఎమ్మెల్యే పదవికి రాజీనామా.. ఆదినారాయణరెడ్డి సంచలన ప్రకటన!

Jordar Varthalu: ఎమ్మెల్యే పదవికి రాజీనామా.. ఆదినారాయణరెడ్డి సంచలన ప్రకటన!

hmtv 3 weeks ago

Jordar Varthalu: ఎమ్మెల్యే పదవికి రాజీనామా.. ఆదినారాయణరెడ్డి సంచలన ప్రకటన!

Jordar Varthalu: నాకు ప్రభుత్వం, అధికారం కంటె కార్యకర్తలే ముఖ్యం. కార్యకర్తల కోసం అవుసరం అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా సుతం జేస్తనని కార్యకర్తల ముందే ప్రకటించిండు కడప జిల్లా జమ్మలమడుగు బిజెపి ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి మాటలు.

మరింతకు ఈ సారుకు గంత కోపం ఎందుకచ్చిందంటే.

దాంట్ల ఏం తేడా అచ్చినా అస్సల్కే తగ్గేది లేదు. రాజీనామా జేసుడే అని ఖరాకండిగ జెప్పిండు ఆదినారాయణ సారు. పువ్వు పార్టీ ఆవిర్భావ దినోత్సవం యాల్ల మన ఊరు - మన జెండా కార్యక్రమం జేస్తున్నరు గదా. ఇగీ కార్యక్రమానికి హాజరువడ్డ ఆది నారాయణ సారు ఇట్ల గరంగరంగ మాట్లాడేటాళ్లకు ఇదిప్పుడు పెద్ద రచ్చకే దారితీసినట్టైంది. కూటమిల లుకలుకలు లేవు, అంత మంచిగనే ఉన్నదని అనుకుంటున్న యాల్ల ఈ మాటలు పెద్ద దుమారాన్నే లేపుతున్నయి పోండ్రి. మరీ ఎమ్మెల్యే సారును కూటమి లీడర్లు ఎట్ల ఇబ్బంది వెడ్తన్నరో ఏం కథనో చెప్పలేదుగనీ., నా ఇబ్బందులు తీర్వకుంటె మాత్రం ఏకంగ రాజీనామానే జేస్తనని జెప్పేటాళ్లకు కార్యకర్తలంత అసల్కు ఏం జరుగుతున్నదోనని శెర్చించుకుంటున్నరట. సూడాలె మరి రావోయే రోజుల్ల ఎట్లుంటదనేది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu