Jordar Varthalu: ఫ్రీ బిర్యానీ కోసం ఎగబడ్డ జనం
Jordar Varthalu: ఓ.. ఏం జనం. ఏం జనం. ఉష్కె పోత్తె రాలుడు కష్టమే ఉన్నది గదా ఈడ. ఒక్కొక్క లెగ్ పీసులు కాదు షేర్ కాన్..
వర్సవెట్టి వంద వడ్డించినా.. ఎన్కాడమన్నట్టే హోటల్ మీద దండయాత్రకు బైలెల్లిర్రు పట్నం జనాలు. గిస్మత్ కమ్ జిస్మత్ జైలు మండి ఓనర్ కమ్ ఎండి పర్ద హీరో ధర్మ మహేష్ పుట్టిన బర్తుడే పేర్మీద నిన్న మాపటీలి ఏడున్నర కెంచి ఎనిమిదిన్నర దాంక.. పట్నంలున్న వాళ్ల హోటల్లల్ల ఫ్రీ మండి బిర్యానీ ఆఫర్ పెట్టిర్రట. ఇగ రీల్సుల పబ్లిసిటీ ఇయ్యంగనే.. తండోపతండాలుగ తరలచ్చిర్రు జనాలు. ఒక్క బిర్యానీ అన్న ఫ్రీగ దక్కిచ్చుకుందామన్నట్టే హోటల్ల మీద దండయాత్ర జేశిర్రు. దిల్షుఖ్ నగర్ల హైవే మీదనే హోటలుండెటాలకు దిల్ ఖుష్ అయిర్రు. ఉర్కచ్చి ఏడు కొట్టకముందే లైన్ కట్టెటాలకు, ఇండ్లల్లకు పొయ్యే పట్నం వాసుల బండ్లకు మస్తు ట్రాఫిక్ జామైంది. బిర్యానీ కోసం లైన్ల నిలవడి గీడ కొందరు తిప్పలు వడ్తుంటె.. ఇంటికి పొయ్యెతందుకు ట్రాఫిక్ల ఇర్కపొయ్యి పట్నం పబ్లికు తిప్పలు వడ్డరు. ఇగ ఎంబటే పోలీసోల్లు ఫీల్డు మీదికచ్చి హోటల్ బంజేపిచ్చి, ఎటోల్లనుఅటు ఎల్లగొట్టి ట్రాఫిక్ తిప్పలు తీర్శిర్రు. అంత నిమ్మలమైన్రుకని. మరి ఒగ కస్టమర్ కొంచెం రిస్కు జేశి.. పేర్లు మార్శి జనాలను పిచ్చోల్లను జేత్తున్నరా అంటే గీనె ఏమంటున్నడో ఇనుర్రి.

