Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Jordar Varthalu: ఒక్కటైన కాంగ్రెస్ లీడర్లు..ఎన్నాళ్లో మరి ఈ ఐక్యత

Jordar Varthalu: ఒక్కటైన కాంగ్రెస్ లీడర్లు..ఎన్నాళ్లో మరి ఈ ఐక్యత

hmtv 4 days ago

Jordar Varthalu: ఒక్కటైన కాంగ్రెస్ లీడర్లు..ఎన్నాళ్లో మరి ఈ ఐక్యత

Jordar Varthalu: లీడర్లంత సుట్టూరంగ కూసుండి ఫుల్ మీల్స్ తింటుంటే వాళ్లకు ఎట్లనిపిస్తున్నదో తెల్వదిగనీ.

వాళ్లింత అన్యోన్యంగ కల్శిమెల్శి తింటున్నది సూశ్న శేతిపార్టీ కార్యకర్తలకు మాత్రం నిజంగనే ఫుల్ మీల్స్ తింటున్న ఫీలింగే అచ్చి ఉంటది. కలహారం కాపురం అన్నట్టు ఎప్పట్కి ఏదో ఒక వివాదాలతోని ఒగలంటె ఇంకొగల్కి పడక, ఒగలి మీద ఇంకొగలు విమర్షలు జేస్కుంట లీడర్లంత ఎప్పుడు జూశ్నా ఉత్తర... దక్షిణ ధ్రువాల లెక్కన్నే ఉండేటోళ్లు. అసొంటిది ఇప్పుడు అందరు ఒక్కతాటి మీదికచ్చి మేమంతా ఒక్కటే అన్నట్టుగ అందరు గల్శి భోజనం జేశిర్రు. మంత్రి కొండ సురేఖ అంటే మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యకు అసల్కే పడది. ఎన్నో మాట్ల డైరెక్టుగనే విమర్షలు గుడ జేస్కున్నరు. అసొంటిది ఇప్పుడు ఆ లీడర్లంత ఒక్కకాడ్నే కూసుండి విందు భోజనం జేశిర్రు. దీనికి హనుమకొండ బాలసముద్రంలున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వేదికైంది.

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఏర్పాటు జేశ్న ఈ విందుకు మంత్రి కొండ సురేఖ, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు, కెఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ రియాజ్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, డిసిసి అధ్యక్షులు ఎనగాల వెంకట్రాంరెడ్డి, అయూబ్ ఖాన్, టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి హాజరువడ్డరు. మరీళ్లు లోపట లోపట ఎన్ని ఉన్నా పైకి మాత్రం ఇట్లనే కల్శిమెల్శి ఉంటరో.. లేకుంటె మా ఇగోలు పక్కకు వెట్టే శాన్సే లేదు. ఏదో ఒక్కపూట కల్శి భోజనం జేశ్నంత మాత్రానా అన్ని మర్శిపోతమా అన్నట్టు మళ్లా వాళ్ల లోపటున్న కోపాన్ని బైటవెట్టుకుంటరో సూడాలె మరి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu