Dailyhunt
Jordar Varthalu: ప్రభుత్వ విధానాలకు పట్నంబాట రాములు

Jordar Varthalu: ప్రభుత్వ విధానాలకు పట్నంబాట రాములు

hmtv 3 weeks ago

Jordar Varthalu: ప్రభుత్వ విధానాలకు పట్నంబాట రాములు

Jordar Varthalu: తెలంగాణలో వ్యవసాయం పండుగలా మారుతుందని ఆశించిన రైతులకు ఇప్పుడు నిరాశే మిగులుతోందా?

సాగు గిట్టుబాటు కాక, సర్కార్ సాయం అందక రైతన్నలు పట్టణాల బాట పడుతున్నారా? అంటే అవుననే అంటున్నారు మన జోర్దార్ రాములు తాత. గ్రామంలో వ్యవసాయం చేసే పరిస్థితి లేక, బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు తట్టాబుట్టా సర్దుకొని వచ్చిన రాములు తాత రైతుల కష్టాలను తనదైన శైలిలో వివరించారు.

గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు మూడు పంటలకు రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారని, అధికారంలోకి వస్తే ఎకరానికి 15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారని రాములు తాత గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాత్రం పరిస్థితి వేరేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu