Jukkal: కేరళ ఎన్నికల్లో జుక్కల్ ఎమ్మెల్యే మార్క్.. కాంగ్రెస్ విజయం
Jukkal: జుక్కల్ (కామారెడ్డి) ఒక నెల రోజుల పాటు అక్కడే మకాం వేసి ఆ నియోజకవర్గం లోని ప్రతి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ దిశ నిర్దేశాలను తీసుకెళ్లి తనకప్పజెప్పిన బాధ్యతను నిర్వర్తించి శభాష్ అనిపించుకున్నాడు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు.
కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎ ఐ సి సి పరిశీలకుడిగా వెళ్లిన ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అక్కడి నాయకులతో వరుసగా సమావేశమౌతు తనకు అప్పగించిన ఆడురు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సి వి శాంత కుమార్ ను,
8 వేల పై చిలుకు మెజారిటీ తో గెలిపించుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు కు కేంద్ర ఎ ఐ సి సి అభినందించింది. కేవలం నెల రోజుల పాటు ఆడురు లో ఉండి కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి గెలుపు కోసం తనదైన శైలిలో చక్రం తిప్పి ప్రతి కుల పరిస్థితుల్లో రంగంలోకి దిగిన ఎమ్మెల్యే పని తీరును అందరు ప్రశంసిస్తున్నారు. దీంతో కేంద్ర ఎ ఐ సి సి దగ్గర ఇంకాస్త పలుకుబడి పెరుగుతుందనే హాట్ టాపిక్ జుక్కల్ నియోజకవర్గం లొ అందరి నోట వినిపిస్తుంది.

