Dailyhunt
Jukkal: కొత్త అధ్యక్షులకు జుక్కల్ ఎమ్మెల్యే దిశానిర్దేశం

Jukkal: కొత్త అధ్యక్షులకు జుక్కల్ ఎమ్మెల్యే దిశానిర్దేశం

hmtv 1 week ago

Jukkal: కొత్త అధ్యక్షులకు జుక్కల్ ఎమ్మెల్యే దిశానిర్దేశం

Jukkal: జుక్కల్ (కామారెడ్డి) రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేసేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయం తో పని చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు.

జుక్కల్ నియోజకవర్గం లోని 8 మండలాల్లో మండలాల వారిగా నూతనంగా నియమితులైన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులకు జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సాధరంగ ఆహ్వానించి సన్మానించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా, స్థానిక సమస్యల పరిష్కారం లో తమదైన శైలిలో చురుకైన పాత్ర పోషిస్తూ ప్రజల మధ్య ఉండేలా చూడాలని తద్వారనే పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేసేందుకు విలుఉంటుందని పిలుపు నిచ్చారు. కార్యకర్తలు, నాయకులు కలిసి కట్టుగా ఉండి నియోజకవర్గ అభివృద్ధి కి తోడ్పడాలని నూతన మండల అధ్యక్షులకు దిశ నిర్దేశం చేశారు.

కార్యక్రమం లో జుక్కల్ మండల అధ్యక్షుడు కులకర్ణి రమేష్ దేశాయ్, బిచ్కుంద మండల అధ్యక్షుడు దడ్గి. మున్నూరు నాగ్ నాథ్, టౌన్ అధ్యక్షుడు కె .విజయ్ భాస్కర్ రెడ్డి, మద్నూర్ అధ్యక్షుడు దరస్వర్. సాయిలు, పెద్ద కొడప్ గల్ అధ్యక్షుడు ఎం. శ్యామప్ప, పిట్లం అధ్యక్షుడు మేఘావాత్. రవీందర్. డోంగ్లి అధ్యక్షుడు కులకర్ణి.గజానాన్, నిజాంసాగర్ అధ్యక్షుడు ప్రజా పండరి, మొహమ్మద్ నగర్ అధ్యక్షుడు ఎన్. రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu