Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Julurupadu: సహకార సంఘాలపై రైతుల ఆగ్రహం.. జూలూరుపాడులో ధర్నా

Julurupadu: సహకార సంఘాలపై రైతుల ఆగ్రహం.. జూలూరుపాడులో ధర్నా

hmtv 1 week ago

Bhadradri Kothagudem: సహకార సంఘాలకు తక్షణం ఎన్నికలు నిర్వహించి పాలకమండలని ఏర్పాటు చేసి సహకార సంఘాలను బలోపేతం చేయాలని కోరుతూ శుక్రవారం జూలూరుపాడు తాహసిల్దార్ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం పిలుపు మేరకు జూలూరుపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు అనంతరం తాసిల్దార్ కి వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు నరేంద్ర కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాలకు ఎన్నికలు జరప కుండా కాలాన్ని గడిపేస్తూ సహకార సంఘాలను నామినేట్ ద్వారా పాలక మండలి ఏర్పాటు చేయాలని ఆలోచన విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు, రాష్ట్ర ప్రభుత్వం రైతుల భాగస్వామ్యంతో రైతుల షేర్ క్యాపిటల్ తో నడుస్తున్న సహకార సంఘాలలో రాజకీయ జోక్యం చేసుకొని రాజకీయ నిరుద్యోగులకు సహకార సంఘం చైర్మన్ డైరెక్టర్లుగా నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టాలని చూడటం సహకార వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే రైతు సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనకు దిగుతామని ఆయన హెచ్చరించారు.

రైతుల పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోళ్లు లేక ఇబ్బందులు పడుతున్న పట్టించుకునే నాధుడు లేకపోయారని వారు ఆరోపించారు రైతుల ఇబ్బంది పడుతున్న ప్రభుత్వ పాలకలు అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల ముందు రెండు లక్షల పైనున్న పంట రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి రెండు లక్షల వరకు రుణాలు ఉన్న రుణాలను మాఫీ చేయటంతో రైతులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు రాష్ట్రంలో పంటల భీమా పథకాన్ని ఏర్పాటు చేసి అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రైతు భరోసా రబీ పంటకు పూర్తిస్థాయిలో ఇవ్వాలని వారు కోరారు రానున్న ఖరీఫ్ సీజన్లో ముందస్తు ప్రణాళిక ద్వారా వ్యవసాయ సహకార సంఘాలను బలోపేతం చేసినందుకు ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు గుండె పిన్ని వెంకటేశ్వర్లు, యాస రోశయ్య, యలంకి మధు సిరిపురపు వెంకటేశ్వర్లు తూము కోటయ్య పొన్నగంటి వెంకటేశ్వర్లు , చిమట ముత్తయ్య, ముత్తిలింగం ఊడల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu