Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kadapa: పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధులకు అడ్డుకట్ట

Kadapa: పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధులకు అడ్డుకట్ట

hmtv 2 days ago

Kadapa: దువ్వూరు మండలం చింతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మాబూనగర్ నందు ఫ్రైడే డ్రైడే కార్యక్రమం లో భాగంగా వైద్యాధికారి డాక్టర్ వికసిత ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ఇంటింటి ఫీవర్ లార్వా సర్వే నిర్వహించడం మయినది.

ఈ సందర్భంగా డాక్టర్ వికసిత మాట్లాడుతూ వాతావరణంలో వచ్చే ఆకస్మిక మార్పులు వలన ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని వేడి మరియు ఉక్కపోత వల్ల వడదెబ్బ,​ చర్మ సమస్యలు, ​ఆహారం త్వరగా పాడైపోయి​ ఫుడ్ పాయిజనింగ్ వస్తాయని, అకాల వర్షాల వల్ల ఇంటి చుట్టుపక్కల గుంతలు, పాత టైర్లు, కొబ్బరి చిప్పల్లో నీరు నిలిచిపోయి డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా వంటి వ్యాధులు ప్రబలుతాయని, వడదెబ్బ బారిన పడకుండా ఎప్పటికప్పుడు తగినన్ని నీళ్లు త్రాగాలని.

ఓ ఆర్ ఎస్ ద్రావణం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీరు తీసుకోవడం చాలా మంచిదని.వర్షపు నీరు ఇంటి పరిసరాల్లో ఎక్కడా నిల్వ ఉండకుండా చూసుకోవాలని . ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేసి, మూతలు గట్టిగా పెట్టాలని,.ప్రతి శుక్రవారం​ డ్రై డే కార్యక్రమం పాటించాలని,నిద్రపోయేటప్పుడు తప్పనిసరిగా దోమ తెరలు వాడాలని,తీవ్రమైన ఎండలో బయటకు వెళ్లడం మానుకోవాలని, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని ప్రజలకు అవగాహన కల్పించడమైనది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి రాజగోపాల్, ఆరోగ్యపర్యవేక్షకుడు శివ గంగరాజు, ఆరోగ్య సహాయకారి జనార్దన్ రావు, సిహెచ్ఓ సౌభాగ్య లక్ష్మి, ఏఎన్ఎం అరుణ జ్యోతి, మరియు ఆశా కార్యకర్త శాంతమ్మ, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu