Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kadiri: కదిరి ఎమ్మెల్యే క్రికెట్ జట్టుపై జిల్లా ఎస్పీ జట్టు ఘన విజయం

Kadiri: కదిరి ఎమ్మెల్యే క్రికెట్ జట్టుపై జిల్లా ఎస్పీ జట్టు ఘన విజయం

hmtv 4 months ago

కదిరి: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ పోటీల్లో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ జట్ల మధ్య క్రికెట్ పోటీ హోరాహోరీగా సాగింది.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న కదిరి ఎమ్మెల్యే జట్టు నిర్ణీత 16 ఓవర్లకు 119 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ దిగిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ జట్టు 10 ఓవర్లకే రెండు వికెట్లు కోల్పోయి లక్షాన్ని అధిగమించింది.

బ్యాటింగ్ లో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రతిభ కనపరచగా బౌలింగ్ లో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ 3 ఓవర్లో కేవలం 15 పరుగులు ఇచ్చి మూడు వికెట్లను తీసుకున్నారు. పోలీస్ జట్టులో బ్యాటర్ నాగేంద్ర 20 బంతులలో అర్థ సెంచరీ చేసి నాటౌట్ గా నిలిచారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ బ్యాటింగ్ చేసినంతసేపు స్టేడియం మొత్తం ఈలలు, కేరింతలు అరుపులతో మారుమోగింది.

యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా సన్మార్గంలో నడిచి ఆరోగ్యమైన జీవితాన్ని గడపాలన్న సంకల్పంతో జరిగిన ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ లో క్రీడా స్ఫూర్తిని చాటే విధంగా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ జట్లు పాటుపడ్డాయి. అనంతరం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫైనల్ పోటీలను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ,ఎస్పి సతీష్ కుమార్ లు ప్రారంభించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu