Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kadiri: కదిరిలో ఇంధన ధరల పెంపుపై సీపీఐ నిరసన

Kadiri: కదిరిలో ఇంధన ధరల పెంపుపై సీపీఐ నిరసన

hmtv 1 week ago

Kadiri: కదిరిలో ఇంధన ధరల పెంపుపై సీపీఐ నిరసన

Kadiri: కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోలు డీజిల్ ధరలపై రూ మూడు రూపాయలు అదనంగా పెంచడాన్ని నిరసిస్తూ AITUC, CPI ఆధ్వర్యంలో కదిరి పట్టణంలోని వేమారెడ్డి కూడలిలో నిరసన తెలియజేసారు.

ఈ సందర్బంగా ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు మధు నాయక్, సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి అసన్ లు మాట్లాడుతూ ఈ మధ్య జరిగిన ఎన్నికల సభలో మోడీ మాట్లాడుతూ భవిష్యత్తులో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగవని చెబుతూ ఎన్నికలు పూర్తవుగానే ఈరోజు నుండే పెట్రోల్ డీజిల్ మూడు రూపాయల వరకు పెంచారని విమర్శించారు ఈ ధరల పెరుగుదల వలన భవిష్యత్తులో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతాయని ప్రజలు మానసికంగా ఆర్థికంగా ఇబ్బందులు పడతారని ఇలా పెంచుకుంటూ పోతే ప్రజల ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.

మరోపక్క దేశ ప్రజలంతా పొదుపుగా ఉండాలని డీజిల్ వాడకూడదని బంగారం కొనకూడదని చెప్పిన మోదీ ఆయన విదేశీ పర్యటనలకు ఆయన వేసుకున్న సూట్ ఎన్ని కోట్లు ఖర్చవుతుందో ప్రజలకు శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

భవిష్యత్తులో ఒక పూట భోజనం చేయండి మరొక పూట యోగా చేయండి అంటారేమని భయమేస్తుంది అని వ్యంగ్యంగా అన్నారు.గతంలో ఏ ప్రధాని ఇటువంటి నిర్ణయాలు తీసుకోలేదని అనేక సంక్షోభాలు యుద్ధాలు వచ్చిన ప్రజలపై భారాలు మోపు లేదని తెలిపారు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు షామీర్ భాషా, నాగభూషణ, రమేష్, kt, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu