Kagaznagar: కుక్కల దాడిలో దుప్పి మృతి
కాగజ్నగర్: కొమరం భీం జిల్లా కాగజ్నగర్ మండలంలోని వంజిరి గ్రామపంచాయతీ పరిధిలోని మహాజన్ గూడ గ్రామ సమీపంలో కుక్కల దాడిలో ఓ దుప్పి మృతి అడవి ప్రాంతం నుంచి ఆహారం, నీటి కోసం గ్రామ శివారుకు వచ్చిన దుప్పిపై వీధి కుక్కలు దాడి చేసినట్లు సమాచారం.
తీవ్ర గాయాలపాలైన దుప్పి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

