Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kaghaznagar: కాగజ్‌నగర్ పోలీసుల గొప్ప మనసు.. మాలిని గ్రామంలో సరుకుల పంపిణీ

Kaghaznagar: కాగజ్‌నగర్ పోలీసుల గొప్ప మనసు.. మాలిని గ్రామంలో సరుకుల పంపిణీ

hmtv 1 week ago

Kaghaznagar: కాగజ్‌నగర్ పోలీసుల గొప్ప మనసు.. మాలిని గ్రామంలో సరుకుల పంపిణీ

Kaghaznagar: జిల్లా ఎస్పీ నితిక పంత్ గారి ఆదేశాల మేరకు, కాగజ్ నగర్ రూరల్ పోలీస్ ఆధ్వర్యంలో రాబిన్ హుడ్ ఆర్మీ ఇంటర్నేషనల్ ఎన్జీవో ల సహకారంతో నిర్వహిస్తున్న "పోలీసులు మీకోసం" కార్యక్రమంలో భాగంగా కాగజ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాలిని గ్రామంలో కాగజ్‌నగర్ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కుమారస్వామి 200 మంది గ్రామస్తులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం, రెండు కిలోల గోధుమపిండి, రెండు కిలోల పప్పు, ఒక కిలో ఉప్పు, మిర్చి పౌడర్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడుతూ.. గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు గ్రామస్తులు దూరంగా ఉండాలని సూచించారు. గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు లేదా కొత్త వ్యక్తులు సంచరిస్తున్నట్లు గమనించిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

అలాగే యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్య, ఉపాధి మరియు మంచి భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu