Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kaliyuga Pandavulu: చిరంజీవికే కాదు వెంకటేష్‌కూ లైఫ్‌ ఇచ్చిన సూపర్‌ స్టార్‌

Kaliyuga Pandavulu: చిరంజీవికే కాదు వెంకటేష్‌కూ లైఫ్‌ ఇచ్చిన సూపర్‌ స్టార్‌

hmtv 1 week ago

Kaliyuga Pandavulu: ఎవరికి ఏది దక్కాలో అది ఖచ్చితంగా దక్కుతుందనేదానికి సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. టాలీవుడ్ చరిత్రను తిరగరాసిన మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ' సినిమా అవకాశం మొదట సూపర్ స్టార్ కృష్ణ వద్దకే వెళ్ళింది.

ఆయన డేట్స్ ఖాళీ లేకపోవడం వల్లే అది చిరంజీవిని వరించి, ఆయనను స్టార్‌ను చేసింది. అయితే, ఇదే సూపర్ స్టార్ కృష్ణ బిజీ షెడ్యూల్ వల్ల కాలేదనుకున్న మరో సినిమా.. విక్టరీ వెంకటేష్ జీవితాన్ని మార్చేసి, ఆయనను హీరోగా నిలబెట్టింది.

కృష్ణ కోసం రాసుకున్న కథ.. వ్యాపారవేత్త కాబోయిన వెంకీ!

తెలుగు చిత్రసీమలో 40 ఏళ్లకు పైగా కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తూ, వివాద రహిత హీరోగా, ఫ్యామిలీ ఆడియన్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు విక్టరీ వెంకటేష్. అయితే, ఆయన అసలు హీరో అవ్వాలనే అనుకోలేదు. స్టార్‌ ప్రొడ్యూసర్‌ డి రామానాయుడి చిన్న కుమారుడైన వెంకటేష్‌ను పెద్ద వ్యాపారవేత్తగా చూడాలని అనుకున్నాడు. దానికి తగినట్టుగానే వెంకటేష్‌ను అమెరికా పంపి ఎంబీఏ చదివించాడు. అయితే, డి రామానాయుడు తన సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మించాలని అనుకున్నాడు. దర్శకుడు కె రాఘవేంద్రరావు ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ యాక్షన్‌ కథను సూపర్‌ స్టార్‌ కృష్ణ వద్దకు వెళ్లింది. కృష్ణ కోసమే స్క్రిప్ట్‌ను రాసుకున్నారు. కథ కృష్ణకు కూడా బాగా నచ్చింది. కానీ, అప్పటికే ఆయన చేతిలో 10 సినిమాలు ఉన్నాయి. ఈ యాక్షన్‌ సినిమా కోసం డేట్‌ సర్థుబాటు కాలేదు. తన వల్ల సినిమా ఆలస్యం కాకూడదని భావించిన సూపర్‌స్టార్‌ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.

ఒకే ఒక్క సలహా.. 'కలియుగ పాండవులు' సంచలనం!

కృష్ణ పక్కకు తప్పుకోవడంతో మరో హీరో కోసం నిర్మాతలు వెతకడం ప్రారంభించారు. ఆ సమయంలో రామానాయుడి సన్నిహితులు బయట హీరోల కంటే హీరోకు ఏమాత్రం తీసిపోని వెంకటేష్‌ను ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేయవచ్చు కదా అని సలహా ఇచ్చారు. సన్నిహితుల సలహా మేరకు రామానాయుడు ఇండియాకు పిలిపించి ముందుగా నటనలో శిక్షణ ఇప్పించాడు. యాక్షన్‌ సినిమా కావడంతో డైలాగ్స్‌, ఫైట్స్‌, డ్యాన్స్‌లో శిక్షణ ఇప్పించాడు. అంతా సవ్యంగా ఉందని అనుకున్న తరువాత సినిమా అనౌన్స్‌ చేశారు. 1986లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయం అందుకుంది. ఉత్తమ నటుడిగా ప్రతిష్టాత్మకమైన నంది అవార్డును సొంతం చేసుకుంది. ఒకవేళ సూపర్‌స్టార్‌ కృష్ణ ఈ సినిమా చేసి ఉంటే... టాలీవుడ్‌కు విక్టరీ వెంకటేష్‌ లాంటి అద్భుతమైన ఫ్యామిలీ హీరో దొరికేవారు కాదేమో.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu