Dailyhunt
Kamareddy: మద్నూర్ లో దొంగల బీభత్సం: ట్రాన్స్‌ఫార్మర్లు ఖాళీ!

Kamareddy: మద్నూర్ లో దొంగల బీభత్సం: ట్రాన్స్‌ఫార్మర్లు ఖాళీ!

hmtv 2 weeks ago

Kamareddy: మద్నూర్ లో దొంగల బీభత్సం: ట్రాన్స్‌ఫార్మర్లు ఖాళీ!

మద్నూర్ (కామారెడ్డి): మద్నూర్ మండల కేంద్రం తోపాటు మండలం లోని సుల్తాన్ పేట్ గ్రామ శివారు వ్యవసాయ బోరు వద్ద గల ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని కాపర్, కాయిల్ ఆయిల్ లను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు.

ఈ విషయాన్ని గ్రామస్థులు పోలీసులకు పిర్యాదు చెయ్యడంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల కాలంలో జుక్కల్ నియోజకవర్గం లోని జుక్కల్, మద్నూర్, డోoగ్లి, పెద్ద కొడప్ గల్, పిట్లం మండలాల్లోని పలు గ్రామాల్లో దొంగలు యధేచ్చగా వ్యవసాయ బోరు బావుల వద్ద గల ట్రాన్స్ఫార్మర్ లను ధ్వంసం చేసి అందులోని కాయిల్స్, ఆయిల్ లను అపహరించి పక్క ప్రాంతాలకు వెళ్ళి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

గతంలో ఒకసారి మద్నూర్ మండలం సలబాత్ పూర్ ఆర్ టి ఓ చెక్ పోస్ట్ వద్ద పోలీస్ లు వాహనాల తనిఖీ చేస్తుండగా పట్టుబడి రిమాండ్ కు వెళ్లడం జరిగింది. మళ్లీ ఇప్పుడు జరుగుతున్న ట్రాన్స్ఫార్మర్ల అపహరణతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ బోరు బావుల వద్ద బిగించిన ట్రాన్స్ఫార్మర్ లు చోరికి గురవుతుండడంతో పంట సాగు కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పోలీసులు ట్రాన్స్ఫార్మర్ చోరికి యత్నించిన దొంగలను పట్టుకుని చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu