Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kanchanbagh: మీడియాకు అనుమతి నిరాకరణ కంచన్‌బాగ్ పోలీసుల తీరుపై విమర్శ!

Kanchanbagh: మీడియాకు అనుమతి నిరాకరణ కంచన్‌బాగ్ పోలీసుల తీరుపై విమర్శ!

hmtv 2 weeks ago

Kanchanbagh: మీడియాకు అనుమతి నిరాకరణ కంచన్‌బాగ్ పోలీసుల తీరుపై విమర్శ!

కంచంబాగ్: తెలంగాణ భవన్ వద్ద BRS నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్ మరియు RS ప్రవీణ్ కుమార్‌ను, పలువురు BRS నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించిన నేపథ్యంలో, అక్కడికి న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

పోలీస్ స్టేషన్ ప్రధాన గేటుకు తాళం వేసి, మీడియా సిబ్బందిని లోపలికి అనుమతించకుండా అడ్డుకోవడం జరిగింది.

అదే సమయంలో స్థానిక BRS నాయకులు, కార్యకర్తలను కూడా స్టేషన్‌లోకి వెళ్లనివ్వకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

విధులు నిర్వర్తించేందుకు వచ్చిన మీడియాను అడ్డుకోవడం సరైంది కాదని పలువురు మీడియా ప్రతినిధులు అభిప్రాయపడగా, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

BRS నాయకులను పరామర్శించడానికి KTR కూడా రానున్నట్లు సమాచారం..

పోలీసుల తీరు పట్ల కార్యకర్తలు ప్రభుత్వం పై వ్యతిరేక నినాదాలు చేయడం జరుగుతుంది..!!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu