Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kandukur: కందుకూరు ఏకలవ్య నగర్‌లో పోలీసుల కార్డెన్ సెర్చ్

Kandukur: కందుకూరు ఏకలవ్య నగర్‌లో పోలీసుల కార్డెన్ సెర్చ్

hmtv 1 week ago

Kandukur: కందుకూరు ఏకలవ్య నగర్‌లో పోలీసుల కార్డెన్ సెర్చ్

Kandukur: ప్రకాశం జిల్లా కందుకూరు రూరల్ పరిధిలోని ఏకలవ్య నగర్‌లో ఆదివారం ఉదయం డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ తనిఖీల్లో సీఐతో పాటు ఆరుగురు ఎస్ఐలు, సుమారు 50 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రాంతంలో గంజాయి వినియోగం, ఇతర అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 41 మోటార్ సైకిళ్లు, ఒక కారు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.

అనంతరం స్థానికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై వివరించారు. గంజాయికి దూరంగా ఉండాలని సూచిస్తూ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. అలాగే అవగాహన ర్యాలీ కూడా నిర్వహించారు. సమాజ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హెచ్చరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu