Dailyhunt
Kapil Vidya Varadhi 2026: పేద విద్యార్థుల చదువుకు 'కపిల్' భరోసా.. మే 20న ఎంట్రన్స్ ఎగ్జామ్..!

Kapil Vidya Varadhi 2026: పేద విద్యార్థుల చదువుకు 'కపిల్' భరోసా.. మే 20న ఎంట్రన్స్ ఎగ్జామ్..!

hmtv 1 week ago

Kapil Vidya Varadhi 2026: పేద విద్యార్థుల చదువుకు 'కపిల్' భరోసా.. మే 20న ఎంట్రన్స్ ఎగ్జామ్..!

పదో తరగతి పూర్తి చేసుకుని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత చదువులకు దూరమవుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదుకునేందుకు "కపిల్ విద్యా వారధి" సంక్షేమ ట్రస్ట్ ముందుకు వచ్చింది.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివి, మంచి మార్కులు సాధించిన విద్యార్థులు తమకు ఇష్టమైన రంగంలో స్థిరపడే వరకు అయ్యే పూర్తి ఖర్చులను భరించడంతో పాటు, వారికి నైపుణ్య శిక్షణ కూడా అందించనున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు ప్రకటించారు.

ఎంపిక విధానం - అర్హతలు:

ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే విద్యార్థులకు మే 20, 2026 (బుధవారం) నాడు కరీంనగర్‌లో అర్హత పరీక్ష నిర్వహించనున్నారు.

పరీక్ష సమయం: ఉదయం 10:00 నుండి 12:00 గంటల వరకు.

వేదిక: శ్రీ సరస్వతి శిశు మందిర్, గాయత్రీ నగర్, కరీంనగర్.

సిలబస్: పదో తరగతి గణితం, ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ మరియు ఇంగ్లీష్ (ప్రశ్నపత్రం కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది).

అర్హత మార్కులు: పదో తరగతిలో కనీసం 520 కంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి.

ముఖ్య నిబంధన: విద్యార్థులు తప్పనిసరిగా 2025-26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి ఉండాలి.

ప్రాధాన్యత:

తల్లిదండ్రులు లేని వారు, సింగిల్ పేరెంట్ పిల్లలు మరియు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఈ పథకంలో ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తారు. ఉత్తర తెలంగాణలోని సుమారు 19 జిల్లాల విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు.

ముఖ్యమైన సమాచారం:

దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 15, 2026.

రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్: www.kapilvidyavaradhi.org

వసతులు: దూర ప్రాంతాల విద్యార్థులకు ఒకరోజు ముందుగా వస్తే వసతి కల్పిస్తారు. పరీక్షానంతరం భోజన సదుపాయం ఉంటుంది. ఉమ్మడి కరీంనగర్ కాకుండా ఇతర జిల్లాల నుండి వచ్చే వారికి ప్రయాణ ఖర్చులు రీయింబర్స్ చేయబడతాయి.

సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:

అప్పిడి రాజిరెడ్డి: 98485 26865

గీకురు శ్రీనివాస్: 99854 82292

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu