Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kapra: కాప్రా చెరువు అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

Kapra: కాప్రా చెరువు అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

hmtv 2 weeks ago

Kapra: కాప్రా చెరువు అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

కాప్రా: కాప్రా చెరువులో హైడ్రా ఆధ్వర్యంలో కొనసాగుతున్న సుందరీకరణ, అభివృద్ధి పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కాలనీ వాసులు, అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా చెరువు చుట్టూ చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే, పనులు నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చెరువును ప్రజలకు ఆహ్లాదకరమైన విహార ప్రదేశంగా తీర్చిదిద్దడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

చెరువు అభివృద్ధి ద్వారా స్థానిక ప్రజలకు మెరుగైన వాతావరణం, వాకింగ్ ట్రాక్, పచ్చదనం, విశ్రాంతి కోసం అవసరమైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల అభిప్రాయాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.

స్థానికులు చెరువు అభివృద్ధిపై తమ అభిప్రాయాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటిని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. కాప్రా చెరువును నియోజకవర్గానికి ఆదర్శవంతమైన పర్యావరణ, వినోద కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తాను కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నవీన్ గౌడ్ పార్టీ నాయకులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu