Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Karimnagar: అలుగు పారుతున్న కొత్తచెరువు.. కాంగ్రెస్ సంబరాలు!

Karimnagar: అలుగు పారుతున్న కొత్తచెరువు.. కాంగ్రెస్ సంబరాలు!

hmtv 1 week ago

Karimnagar: అలుగు పారుతున్న కొత్తచెరువు.. కాంగ్రెస్ సంబరాలు!

కరీంనగర్: కొత్తపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని నాగులమల్యాల గ్రామ శివారు కొత్తచెరువు నిండి అలుగు పారుతున్న సందర్భంగా సంబరాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కరీంనగర్ కార్పొరేషన్ సిడీసీసీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ విచ్చేసి గంగమ్మ తల్లికి పూలభిషేకం చేశారు.

ఈ సందర్భంగా వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ ఎల్లంపల్లి - శ్రీపాద ప్రాజెక్టుల నుంచి వరద కాలువ ద్వారా వస్తున్న నీరు ఆనాటి కాంగ్రెస్ మహానాయకులు పీవీ నరసింహారావు ఆలోచన విధానం ఫలితం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కృషితో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది. కాంగ్రెస్ నాయకుల ముందు చూపు వల్లనే ఈరోజు కరీంనగర్ జిల్లా సస్యశ్యామలంగా ఉంది. కరువు పరిస్థితుల్లో కూడా చెరువులు అలుగుపారుతున్నాయి అని అన్నారు.

బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం నీళ్లంటూ అబద్ధ ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రేవంత్ అన్న ప్రజా ప్రభుత్వాన్ని గంగమ్మ తల్లి ఆశీర్వదించి ఈరోజు చెరువులు నింపుతోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటోంది"_ అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు స్వామి గౌడ్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు మడుపు మోహన్, కామరెడ్డి, రాంరెడ్డి, తిరుపతి, అమరిశెట్టి కనకయ్య, గుంటూరు మురళి, మల్యాల రాజా గౌడ్, సుంకే రాజగోపాల్, నాంపల్లి రష్మయ్య, బండపల్లి చందు, పెంట శేఖర్, వెన్నం శ్రీనివాస్, కుమ్మరి నాగయ్య, దేవదాస్, శంకర్, నరేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu