Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Karimnagar: అమరుడు కిష్టయ్య కుటుంబానికి కేటీఆర్ భరోసా!

Karimnagar: అమరుడు కిష్టయ్య కుటుంబానికి కేటీఆర్ భరోసా!

hmtv 1 hr ago

Karimnagar: తెలంగాణ ఉద్యమం సమయంలో విధి నిర్వహణలో ఉండి తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన కిష్టయ్య కుటుంబాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడారు.

కేటీఆర్ మాట్లాడుతూ నాడు తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది ప్రాణ త్యాగం చేసి దూరమయ్యారని వారి త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ ఈ తెలంగాణలో వారికి అండగా ఉండడం మా కర్తవ్యం అని అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక అమరుల కుటుంబాలను ఆదుకున్నామని ఇప్పటికీ ఆదుకుంటూనే ఉన్నామని అమరుల త్యాగాలకు వెలకట్టలేమన్నారు. పోలీస్ కిష్టయ్య కుటుంబానికి వారి పిల్లల చదువుకి సహాయం చేశామని వారి కూతురు ఉన్నత చదువులకు పార్టీ భరిస్తూ చదివిస్తుందని తెలిపారు.

అన్ని అమరుల కుటుంబాలను ఆదుకుంటాం....

తెలంగాణ ఉద్యమం కోసం ఎంతోమంది బలిదానం చేసుకున్నారని, వారి త్యాగాలు వెలకట్టలేనివి అన్నారు. హలో అమరులైన ఏ ఒక్క ఉద్యమకారునికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని వారికి అన్నివేళలా అండగా ఉంటామన్నారు.

కిష్టయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన కేటీఆర్..

అమరుడు కిష్టయ్య కూతురు ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహాయాన్ని అందించిన కేటీఆర్. కిష్టయ్య మరణం సమయంలో ఆయన కూతురు ఇంటర్మీడియట్ ఉన్న సమయంలో ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని కేసీఆర్ ప్రకటించాక ఆమె ఎంబిబిఎస్ చేయడానికి ఖర్చులు ప్రభుత్వం అందించిందన్నారు. ఇప్పుడు ఎంబీబీఎస్ పూర్తయి పీజీ చదువు కోసం ఆర్థిక సహాయాన్ని తన బాధ్యతగా పార్టీ తరఫున అందించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కేటీఆర్ తో పాటుగా జీవన్ రెడ్డి,ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ , రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్, తుల ఉమా, చల్లా హరిశంకర్, జీవి రామకృష్ణ, స్థానిక బిఆర్ఎస్ కార్పొరేటర్లు, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu