Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Karimnagar: బండి సంజయ్ రాజీనామాకు డిమాండ్.. సిపిఎం అర్ధనగ్న నిరసన!

Karimnagar: బండి సంజయ్ రాజీనామాకు డిమాండ్.. సిపిఎం అర్ధనగ్న నిరసన!

hmtv 3 days ago

Karimnagar: బండి సంజయ్ రాజీనామాకు డిమాండ్.. సిపిఎం అర్ధనగ్న నిరసన!

కరీంనగర్: మైనర్ బాలికను వేధించి,అత్యాచారం చేసిన బండి సాయి భగీరథ కఠినంగా శిక్షించాలని, ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ రాజీనామా చేయాలని సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ముందు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ నిన్న బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కన్న కొడుకును పోలీసులకు అప్పగించిన చరిత్ర ఎక్కడైనా ఉందా అని ప్రగల్బాలు పలికారు కదా కేంద్ర హోమ్ సహాయ మంత్రి అయి ఉండి నేరా రూపంలో ఎదుర్కొంటున్న ఒక కొడుకుని 8 రోజులు దాచిపెట్టిన చరిత్ర ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. ఒక నేరస్తుని దాచిపెట్టి, తన మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని కేసును తప్పుదోవ పట్టించిన బండి సంజయ్ పైన కూడా A 2 గా కేసు నమోదు చేయాలని, డిమాండ్ చేశారు.బండి సంజయ్ మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని తాను మంత్రిగా ఉంటే కేసును నీరుగార్చి న్యాయవిచారణ జరగకుండా అడ్డుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు.

బేటి బచావో నినాదాలు చేస్తున్న బిజెపి కి బండి కొడుకు చేసిన ఘనకార్యం కనబడడం లేదా?

చట్టాన్ని కాపాడి ప్రజలను రక్షించవలసిన కేంద్ర హోమ్ సహాయ మంత్రి కొడుకే మైనర్ బాలిక పై అత్యాచారం చేస్తే ఇక దేశంలో మహిళలకు రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు.బండి భగీరథ తప్పు చేయకుంటే 8 రోజులు ఎందుకు పారిపోయాడని, దొరికిన తర్వాత ఫోక్సో కేసు ఆధారాలు లేకుండా ఫోన్లో సిమ్ ఎందుకు మాయం చేశాడని అన్నారు.

ఇవన్నీ కేంద్ర హోమ్ మినిస్టర్ కు కనబడడం లేదా, ఇంకా బండి సంజయ్ ని మంత్రివర్గంలో ఎందుకు కొనసాగిస్తున్నారని అన్నారు. ఫోక్సో కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాల్సింది పోయి, కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. సామాన్యుడు తప్పు చేస్తే వారి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఆచూకీ తెలుపమని విచారించే పోలీసులకు బండి సంజయ్ కూడా ఎనిమిది రోజులు దొరకలేదా ? అతని స్టేషన్ కి పిలిచి ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు.

చట్టం ఉన్నోడికి చుట్టమా? పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. ఈ కేసులో నేరస్తునికి సహకరించిన బండి సంజయ్ ని కూడా నేరస్తునిగా పరిగణించాలని, తనని వెంటనే కేంద్ర మంత్రి పదవి నుండి భర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేశారు లేనియెడల బండి సంజయ్ రాజీనామా చేసే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గజ్జల శ్రీకాంత్,రాయికంటి శ్రీనివాస్,నగర కమిటీ సభ్యులు పున్నం రవి, ఆసంపల్లి వినయ్, డబిల్ కార్ శ్రీకాంత్,భూమేష్, అరవింద్,అక్షయ్,రాకేష్, సంతు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu