Karimnagar: భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్
కరీంనగర్ జిల్లా: తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలలో మున్సిపల్ కార్యాలయంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ దళిత వైతాళికుడుగా ప్రసిద్ధి చెందిన భాగ్యరెడ్డి వర్మ (మే 22,1888 - ఫిబ్రవరి 18, 1939) సంఘ సంస్కర్త, ఆది ఆంధ్ర సభ స్థాపకుడు.
1906-1933 మధ్య హైదరాబాద్ సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి, వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశాడు. జగన్మిత్రమండలి, మన్యసంఘం, సంఘసంస్కార నాటకమండలి, అహింసా సమాజంలను స్థాపించి హైదరాబాదు ప్రాంతంలో సంఘసంస్కరణలకై కృషిచేశాడు అలాంటి మహనీయుని జయంతిని అధికారికంగా జరుపుకోవడం సంతోషకరమని తెలుపుతూ ఇలా జయంతిని వర్ధంతిలు జరుపుకోవడమే కాకుండా యువత వారి ఆశయాల్లో ముందుకుసాగాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి కౌన్సిలర్స్ కొలుగురి సురేష్, కూతడి తిరుపతి, శీలం శ్రీనివాస్, చందా రాజు, మేనేజర్ జి రాజిరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, RI భాస్కర్, వాణి మరియు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

