Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Karimnagar: ఎడ్ల వ్యాపారులను బెదిరించి నగదు, బంగారం వసూలు

Karimnagar: ఎడ్ల వ్యాపారులను బెదిరించి నగదు, బంగారం వసూలు

hmtv 2 days ago

Karimnagar: ఎడ్ల వ్యాపారులను బెదిరించి నగదు, బంగారం వసూలు

Karimnagar: ఎడ్లు కొనుగోలు చేసి తీసుకువస్తున్న ఇద్దరు వ్యక్తులను బెదిరించి నగదు బంగారం వసూలు చేసిన కేసులో పదకొండు మంది పై కేసు నమోదు చేశారు పోలీసులు, ఎనిమిది మందిని అరెస్ట్ చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ప్రెస్మీట్లో ఏసీపీ మాదేవి మాట్లాడుతూ . గత రెండు రోజుల క్రితం అర్ధ రాత్రి నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు జమ్మికుంట సమీప గ్రామాల నుండి రెండు ఎడ్లు కొనుగోలు చేసి అశోక లైలాండ్ వాహనం లో నల్గొండ కు తరలిస్తున్న క్రమం లో,

స్థానిక పాత మున్సిపాలిటీ కార్యాలయం వద్ద వారిని అడ్డగించారు కొంత మంది యువకులు. మద్యం మత్తులో వారిని బెదిరించి 38 వేల నగదు అర తులం బంగారు ఉంగరం తీసుకున్నారు అంతే కాకుండా తమకు మరో లక్ష రూపాయలు ఇవ్వాలని రాత్రంతా తిప్పుకుంటూ డిమాండ్ చేశారు. దీంతో తెల్లవారుజామున ఇద్దరు వ్యక్తులకు జనాలు కనబడడంతో గట్టిగా అరవడంతో వారిని అక్కడే విడిచి పారిపోయారు. ఆయువకులు.

అనంతరం బాధితులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని విచారించిన పోలీసులు బాధ్యులైన పదకొండు మంది పై కేసు నమోదు చేసి ఎనిమిది మంది యువకులను అరెస్ట్ చేశారు మరో ముగ్గురు పరారీలో ఉన్నట్టు తెలిపారు.వారి వద్ద నుండి 14వేల నగదు ,అరతులం బంగారు ఉంగరంతో నోటులు నాలుగు బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. మిగతా.వారిని.త్వరలో.పట్టుకుంటామని అన్నారు ఈ యొక్క టీమ్ లో పాల్గొన్న పోలీసులను అభినందించి రివార్డ్ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట సీఐ రామకృష్ణ గౌడ్ ఎస్సై రవి. హుజురాబాద్ ఎస్సై రాధాకృష్ణ పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu