Karimnagar: గడ్డి కట్టలు అంటుకుని దగ్ధం.. రైతు ఫిర్యాదుతో కేసు నమోదు
Karimnagar: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలోని ముంజంపల్లి గ్రామంలో వ్యవసాయ బావుల వద్ద గడ్డి కట్టలు అంటుకుని పక్కనే గుడిసెలో ఉన్న మూడు ఆవులలో రెండు ఆవులు (ఆవు - దూడ) అగ్నికి ఆహుతి అయ్యాయి.
ముంజంపల్లి గ్రామానికి చెందిన ఎడ్ల శ్రీధర్ రెడ్డి చెందిన దాదాపు 200 గడ్డి కట్టలతో పాటు గుడిసె గుడిసెలో కట్టేసిన ఆవు దూడ రెండు అగ్నికి ఆహుతి కావడం జరిగింది.
అగ్నికి తాడు తెగి ఇంకో ఆవు గాయాలతో బయటపడడం జరిగింది. దాదాపుగా రెండు లక్షల వరకు అగ్నికి హాహుతై రైతుకు నష్టం వాటిల్లిందని జరిగిందని రైతు తెలిపారు. దీనిపై కొందరి వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేస్తూ రైతు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక సీఐ శ్రీలత తెలిపారు.

