Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Karimnagar: ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి హాజరైన కాంగ్రెస్ అధ్యక్షురాలు

Karimnagar: ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి హాజరైన కాంగ్రెస్ అధ్యక్షురాలు

hmtv 2 days ago

Karimnagar: ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి హాజరైన కాంగ్రెస్ అధ్యక్షురాలు

Karimnagar: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అబ్దుల్ నబి రేష్మ la నూతన ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న వెంకటరాం రెడ్డి హాజరై, కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ఇందిరమ్మ గృహ పథకం పేదలకు ఎంతో ఉపయోగకరంగా మారిందని తెలిపారు. పేద కుటుంబాలు సొంత ఇల్లు నిర్మించుకోవడానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించడం ఒక మంచి శుభ పరిణామమని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ పథకం ద్వారా కూలీలు, మేస్త్రీలు, ట్రాక్టర్లు తదితర రంగాల్లోని కార్మికులకు కూడా చేతినిండా పని దొరుకుతుందని ఆమె పేర్కొన్నారు.

పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అనిల్, గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu