Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Karimnagar: జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం.. చిన్నారులకు మాత్రలు

Karimnagar: జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం.. చిన్నారులకు మాత్రలు

hmtv 11 hrs ago

Karimnagar: జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం.. చిన్నారులకు మాత్రలు

కరీంనగర్: నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా "ఆరోగ్యకరమైన అలవాట్లు, ఆనందకర బాల్యం" అనే నినాదంతో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఉచితంగా అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సుభాష్ నగర్ లోని ప్రభుత్వ పాఠశాలలో జిల్లా కలెక్టర్ చిత్రామిశ్రా , మేయర్ కొలగాని శ్రీనివాస్ , బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు స్వయంగా చిన్నారులకు అల్బెండజోల్ మాత్రలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

పిల్లల్లో రక్తహీనత లేకుండా చూసుకోవాలి...

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు రక్తహీనత లేకుండా చూసుకోవాలని నులి పురుగుల వల్ల రక్తహీనత ఏర్పడే అవకాశం ఉందన్నారు. పిల్లలకు రక్తహీనత వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని అందుకే ప్రభుత్వం నులిపురుగుల నివారణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. నులిపురుగుల నివారణ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారని ఏ మాత్రం వేయడం వల్ల నులి పూరువులు చనిపోతాయని ప్రతి ఒక్కరు ఒకటి నుండి 19 సంవత్సరాల పిల్లల మాత్రలు వేయాలన్నారు.

ఉపాధ్యాయులు ఆరోగ్య సిబ్బంది తల్లిదండ్రులు పిల్లలకు ఈ పాత్రలు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రామిశ్రా , కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్ , బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు కరీంనగర్ డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు , స్థానిక కార్పొరేటర్ అంజన్ కుమార్ , జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO), జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu