Dailyhunt
Karimnagar: జమ్మికుంటలో వెల్లివిరిసిన సత్యసాయి సేవా తత్పరత!

Karimnagar: జమ్మికుంటలో వెల్లివిరిసిన సత్యసాయి సేవా తత్పరత!

hmtv 0 months ago

Karimnagar: జమ్మికుంటలో వెల్లివిరిసిన సత్యసాయి సేవా తత్పరత!

కరీంనగర్ జిల్లా: జమ్మికుంట పట్టణంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని స్థానిక బస్టాండ్ ఆవరణంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని సమితి కన్వీనర్ గన్ను సతీష్ కుమార్ తెలియజేశారు చలివేంద్రం సేవలు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సుమారు 60 రోజులు కొనసాగుతాయని బాటసారులు, ప్రయాణికులు దాహార్తి తీర్చుకునే నిమిత్తం ఈ చలివేంద్రం ద్వారా చల్లటి మినరల్ వాటర్ ని అందజేయడం జరుగుతుందని అలాగే వారానికి రెండు రోజులు రాగి జావా మరియు మజ్జిగ పంపిణీ సేవా కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని సత్యసాయి సేవా సమితి కన్వీనర్ గన్ను సతీష్ కుమార్ తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ మున్సిపల్ చైర్మన్ దిలీప్ పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యసాయి సేవలను కొనియాడుతూ ఈ వేసవి కాలంలో చలివేంద్రం ద్వారా ఏర్పాటు చేసే చల్లటి మినరల్ వాటర్ ని స్వీకరించి దాహార్తిని తీర్చుకోవాలని సమాజ సేవలో ఎప్పుడు ముందుండే జమ్మికుంట సత్యసాయి సేవ సమితి కరోనా టైములో కూడా సేవలు అందించారు కుటుంబ సభ్యులందరికీ వారి యొక్క అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సమితి పెద్దలు డాక్టర్ సత్యం సావిత్రి, చందా విశ్వనాథం , గన్ను ఉపేందర్ గారు, గౌరీశెట్టి సత్యనారాయణ గారు తదితర సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu