Dailyhunt
Karimnagar: జ్యువెలరీ షాపులో కాల్పుల కలకలం.. ఘటనా స్థలికి బండి సంజయ్

Karimnagar: జ్యువెలరీ షాపులో కాల్పుల కలకలం.. ఘటనా స్థలికి బండి సంజయ్

hmtv 2 weeks ago

Karimnagar: జ్యువెలరీ షాపులో కాల్పుల కలకలం.. ఘటనా స్థలికి బండి సంజయ్

Karimnagar: బంగారం కొనుగోలు చేస్తామని పీఎంజే జ్యువెలరీ షాపులోకి చొరబడి కాల్పులు జరిపారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.

''అనుకోని సంఘటన ఇది. ఈ ఘటన జరిగే సమయానికి కొద్ది నిమిషాల ముందు ఈ ఏరియాలోనే పలు అభివ్రుద్ది పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న. పోలీసులు కూడా ఉన్నారు. ఘటన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు కరీంనగర్ ను జల్లెడ పడుతున్నారు. దుండుగలను కచ్చితంగా పట్టుకుంటారనే నమ్మకం ఉంది''అని తెలిపారు.

కరీంనగర్ లోని జ్యోతినగర్ పీఎంజే జ్యువెలరీ షాపు సిబ్బందిపై దుండగుల కాల్పుల ఘటన సమాచారం తెలిసిన వెంటనే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్ బోయినిపల్లి ప్రవీణ్ కుమార్ తదితరులతో కలిసి ఘటన స్థలానికి వెళ్లారు. జ్యువెలరీ షాపులోని సీసీ పుటేజీని పరిశీలించారు. కాల్పుల ఘటనపై షాపు సిబ్బంది వద్ద ఆరా తీశారు. అసలేం జరిగింది అనే అంశంపై అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత పోలీస్ కమిషనర్ తోపాటు స్థానిక పోలీసులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి ఏమన్నారంటే

ఇది అనుకోని సంఘటన. అత్యంత దురద్రుష్టకరం. సీసీ పుటేజీ, సిబ్బంది చెప్పిన వివరాలను బట్టి మొత్తం ఐదుగురు దుండుగులు చోరీ చేయడానికి జ్యువెలరీ షాపులోకి వచ్చి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. తొలుత ఒక వ్యక్తి వచ్చి 20 గ్రాముల చైన్ కావాలి చూపాలన్నారు కాసేపటికే మరో ఇద్దరు వచ్చి గోల్డ్ అభరణాలు కొంటాం చూపాలన్నారు. బంగారు ఆభరణాలు చూపిస్తున్న సమయంలో మరో ఇద్దరు వచ్చారు. దుండుగులు తెలుగు, హిందీ భాషలు మాట్లాడుకున్నారు.

ఐదుగురు కలిసి తుపాకులు చూపించి బెదిరించి అభరాణలను చోరీ చేసేందుకు యత్నించారు. అడ్డుకున్న షాపు సేల్స్ మేనేజర్, ఇతర సిబ్బందిపై కాల్పులు జరిపారు. సిబ్బంది చాలా ధైర్యంగా తెగించి అడ్డుకున్నారు. ఆ క్రమంలోనే వారికి గాయలయ్యాయి. ఇప్పటి వరకైతే ప్రాణాపాయం ఏమీ లేదని డాక్టర్లు చెబుతున్నారు. అయినప్పటికీ బాధితులకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలిస్తున్నాం.

ఈ ఘటన జరిగే సమాయానికంటే 10 నిమిషాలకు ముందే షాపు సమీపంలోనే అభివ్రుద్ధి పనులను ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొన్నా. ఘటన జరిగిన వెంటనే నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో పోలీసులు అప్రమత్తమై కరీంనగర్ ను చుట్టుముట్టారు. దుండుగులను పట్టుకుంటారనే నమ్మకం ఉంది.

ఏదేమైనా అధికారులు సీసీ పుటేజీ పరిశీలిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూంలోని సీసీ పుటేజీ పరిశీలిస్తున్నారు. క్లూస్ టీం వచ్చింది. బాధితుల స్టేట్ మెంట్ తీసుకుంటున్నారు. దొంగ తనం చేయడానికే షాపులోకి చొరబడ్డట్లు తెలుస్తోంది. సిబ్బంది అడ్డుకోవడంతో ఒక బ్యాగును ఇక్కడే జార విడిచారు. ఎంత గోల్డ్, ఇతర అభరణాలు ఎత్తుకెళ్లారనేది పోలీసుల విచారణలో తేలుతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu