Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Karimnagar: కలెక్టర్‌కు మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ వినతి.. ధాన్యం కొనాలని డిమాండ్!

Karimnagar: కలెక్టర్‌కు మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ వినతి.. ధాన్యం కొనాలని డిమాండ్!

hmtv 1 day ago

Karimnagar: కలెక్టర్‌కు మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ వినతి.. ధాన్యం కొనాలని డిమాండ్!

కరీంనగర్: కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రాను వారి కార్యాలయం లో కలసిన మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ రైతులు ఎదురకొంటున్న సమస్యలపై వినతి పత్రం అందించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాలలో.ధాన్యం కొనుగోలు లో అవకతవకలు

నెలకొని ఉన్నాయన్నారు.కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలు, తూకాల్లో మోసాలను అరికట్టి, తక్షణమే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసారు గత 45 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత తీవ్రంగా ఉందన్నారు. మట్టి తరలింపు పై ఉన్న శ్రద్ధ ధాన్యం కొనుగోళ్లపై పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యపు సంచులకు చెదలు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రతి క్వింటాలు వడ్లకు ఏకంగా 10 కిలోల వరకు తరుగు పేరిట కట్ చేస్తూ రైతుల పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 'ఏ' గ్రేడ్‌గా కొనుగోలు చేసిన ధాన్యాన్ని సైతం ఇప్పుడు 'బి' గ్రేడ్‌గా మారుస్తూ క్వింటాల్‌కు రూ.20 వరకు తగ్గిస్తున్నారని, అదనంగా 'తాలు' నెపంతో వడ్లను నిలువునా దోచుకుంటున్నారని ఆరోపించారు.

కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచులు, హమాలీల కొరత తీవ్రంగా ఉందన్నారు. లారీ యజమానులు ప్రతి బస్తాకు రెండు రూపాయల చొప్పున అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వారు మండిపడ్డారు. ఈ ప్రాంతంలో దాదాపు 60 శాతం వరిధాన్యం ఇంకా కేంద్రాల్లోనే మూలుగుతోందని, రానున్న రోజుల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసారు.వెంటనే మట్టి తరలింపు లారీలను నిలిపివేసి, ఆ లారీలను ధాన్యం రవాణాకు మళ్ళించి, యుద్ధప్రాతిపదికన ధాన్యాన్ని తూకం వేసి మిల్లులకు తరలించాలని రవిశంకర్ జిల్లా కలెక్టర్‌ను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ లు పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డీలు, పలువురు బారాస నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu