Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Karimnagar: కరీంనగర్ డంపింగ్ యార్డు ప్రక్షాళనకు రూ. 17 కోట్లు

Karimnagar: కరీంనగర్ డంపింగ్ యార్డు ప్రక్షాళనకు రూ. 17 కోట్లు

hmtv 1 hr ago

Karimnagar: కరీంనగర్ డంపింగ్ యార్డు ప్రక్షాళనకు రూ. 17 కోట్లు

కరీంనగర్: డంపు యార్డు సమస్య శాశ్వత పరిష్కారం కొసం తమ పాలకవర్గం తీస్కుంటున్న చర్యలను చూసి కొంత మంది కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కు మా పాలకవర్గానికి ఎక్కడ పేరు వస్తదో అని ప్రజల్లో ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు.

కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి లో భాగంగా శుక్రవారం 41 వ డివిజన్ లో మేయర్ కొలగాని శ్రీనివాస్ పర్యటించారు.

కట్టరాంపూర్ లో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, స్థానిక కార్పోరేటర్ నాంపల్లి కవిత శ్రీనివాస్ తో కలిసి నగరపాలక సంస్థ కు చెందిన రూ. 12 లక్షల సాధారణ నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు మేయర్ భూమీ పూజ చేసి పనులు ప్రారంభించారు. డివిజన్ కాలనీల్లో పాదయాత్ర చేపట్టి స్థానిక ప్రజల సమస్యలను తనిఖీ చేసి పరిశీలించారు. ప్రజలు, కార్పోరేటర్ దృష్టికి తెచ్చిన సమస్యల పరిష్కారం పై ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చేపట్టి అభివృద్ధి పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ నగరంలో కొంత మంది నాయకులకు ఇంత కాలం డంపు యార్డు సమస్య, స్థానిక ప్రజల ఇబ్బందులు కనబడలేదు. కానీ తమ పాలకవర్గం డంపు యార్డు శాశ్వత పరిష్కారం కొసం 17 కోట్లు నిధులు విడుదల చేసి బయోమైనింగ్ ప్రక్రియ చేపడుతుంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కి మా పాలకవర్గం కు ఎక్కడ పేరు వస్తదో అని ప్రజల్లో ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 20 సంవత్సరాలు పదవుల్లో ఉండి ఏం చేయలేక సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారని తెలిపారు.

మాటలు చెప్పడం కాదు మా పాలకవర్గం ఒక ప్రణాళిక తో గత 30 సంవత్సరాల డంపు యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అవసరాలను బట్టి మరిన్ని నిధులు కేటాయించి అయినా డంపింగ్ యార్డు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని తెలిపారు. కొంత మంది ప్రతిపక్ష నాయకులు అధికారంలో ఉండి కూడ డంపు యార్డు సమస్య పరిష్కారం కు ఏం చేయలేక పోయారని అన్నారు.

ఇప్పుడు మా పాలకవర్గం ప్రణాళికతో ముందుకు వెళ్తూ డంపింగ్ యార్డు సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తుంటే ఓర్వలేక ప్రజల మెప్పు కొసం పాకులాడుతున్నారని తెలిపారు. స్వచ్చ్ బారత్ మిషన్ 17 కోట్లతో బయోమైనింగ్ ప్రక్రియ చేపడుతామని తెలిపారు. అవసరం మేరకు మరిన్ని నిధులు కూడ కేటాయించి సాధ్యమైనంత తొందరలోనే స్థానిక ప్రజల ఇబ్బందులను తొలగిస్తామని ఆ దిశగా మా పాలకవర్గం పని చేస్తుందని తెలిపారు.

ఇప్పటికి టెండర్ ప్రక్రియను పూర్తి చేశామని త్వరలోనే బయోమైనింగ్ ప్రక్రియ పనులు ప్రారంభం చేస్తామన్నారు. అంతే కాకుండా డంపింగ్ యార్డు కు యూసిఎఫ్ స్కీలో కూడ 80 కోట్లు కేటాయించామని తెలిపారు. త్వరలోనే యూసిఎఫ్ టెండర్లు పూర్తి చేసి చెత్త ప్రాసెసింగ్ పనులను కూడ ప్రారంభం చేస్తామన్నారు. రెండు విధాలుగా డంపుయార్డులో ముమ్మరంగా పనులు చేసి డంపింగ్ యార్డు ను ప్రక్షాళన చేస్తామని తెలిపారు.

నగరపాలక సంస్థ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యంగా మేము పని చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారి సలహాలు, సూచనలు పాటిస్తూ ప్రజలకు కావల్సిన వసతులు కల్పించి వారి సమస్యలను తీర్చడం జరుగుతుందని తెలిపారు. 41 వ డివిజన్ అభివృద్ధి కోసం యూఐడీఎఫ్ లో దాదాపు 40 కోట్లు కేటాయించామని త్వరలోనే వాటి పనులు కూడ చేపట్టి డివిజన్ ను అందంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఈఈ లచ్చిరెడ్డి, ఏఈ భీంవర్ధన్ రెడ్డి, కాలనీవాసులు, నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu