Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Karimnagar: కరీంనగర్ డీసీసీ ఆఫీస్‌లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ

Karimnagar: కరీంనగర్ డీసీసీ ఆఫీస్‌లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ

hmtv 6 days ago

Karimnagar: కరీంనగర్ డీసీసీ ఆఫీస్‌లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ

Karimnagar: జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం అధ్యక్షతన నేడు డిసిసి కార్యాలయంలో జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, డిసిసి అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్న కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తో సహా జిల్లాకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యారు.

సమావేశంలో భాగంగా ప్రధానంగా వరి ధాన్యం కొనుగోలు, కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన సర్, మంచినీటి సమస్య తదితర అంశాలపై చర్చించడం జరిగింది. సమావేశాన్ని ఉద్దేశించి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నియోజకవర్గాల వారీగా వరి ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్టీ నేతలు క్రియాశీలకంగా పని చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఐకెపి సెంటర్ల వద్ద తాలు, తప్పా పేరుతో తరుగు లేకుండా కొనుగోలు జరిగేలా కాంగ్రెస్ శ్రేణులు పర్యవేక్షించాలని, రైస్ మిల్లర్లు, దళారుల మోసాలను అరికట్టడంలో చొరవ చూపడంతో పాటు జిపిఎస్ విధానం వల్ల లారీల కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులను స్థానిక శాసనసభ్యులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

ఎస్ఐఆర్ - ఓటరు జాబితా సవరణ..

కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) పై నియోజకవర్గ ఇంచార్జ్‌లు, కో-ఆర్డినేటర్లు, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరీంనగర్ జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ పై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపినారు. ఎస్ఐఆర్ పేరుతో సెక్యులర్ ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని, ప్రజలు తమ ఓటు విషయంలో జాగ్రత్తగా ఉండాలి పేర్కొన్నారు.

బీఎల్ఏ-2 నియామకం..

పీసీసీ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో బిఎల్ఏ-2 (బూత్ లెవెల్ ఏజెంట్)ల నియామకం వెంటనే పూర్తి చేసి, నియమించిన బీఎల్ఏల పేర్లను ప్రతి నియోజకవర్గం నుండి డిసిసి ద్వారా జిల్లా కలెక్టర్‌కు అందజేయాలని, బీఎల్ఏల ద్వారా స్థానికంగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహాయం చేయాలని ఆదేశించారు.

వేసవిలో తాగునీటి సమస్యపై సమీక్ష..

ఈ వేసవి కాలంలో అధిక ఎండల ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రభుత్వం, పార్టీ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఇప్పటికే ఆదేశించడం జరిగిందన్నారు. నియోజకవర్గాల వారీగా తాగునీటి సమస్యపై కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్పొరేటర్లు, సర్పంచ్‌లు ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు. ప్రజలు, మూగజీవుల కోసం ముఖ్య కూడళ్లు, బస్టాండ్లు, ఆసుపత్రుల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని పార్టీ శ్రేణులకు సూచించడం జరిగింది.

కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యులు అంజన కుమార్ మాట్లాడుతూ పార్టీ నామినేటెడ్ పదవుల నియామకంలో పార్టీలో మొదటి నుండి క్రియాశీలంగా పని చేస్తున్న వారికి గుర్తింపు ఇవ్వాలని అన్నారు. నామినేటెడ్ పదవులు, పార్టీ పదవుల నియామకంలో పార్టీ నిర్ణయించిన విధంగా కనీసం మూడు సంవత్సరాలుగా పార్టీలో కొనసాగుతున్న వారికి అవకాశం కల్పించాలనే అంశాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. కష్టకాలంలో పార్టీ వెన్నంటి ఉన్న కార్యకర్తలకు న్యాయం జరిగేలా అధిష్ఠానం ప్రత్యేక శ్రద్ధ చూపాలని సమావేశం ద్వారా విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, కోడూరు సత్యనారాయణ గౌడ్, హుజురాబాద్ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు, పీసీసీ ప్రధాన కార్యదర్శి రెహమత్ హుస్సేన్, అనుబంధ సంఘాల అధ్యక్షులు కర్ర సత్య ప్రసన్నారెడ్డి, ఎండి తాజుద్దీన్, పులి ఆంజనేయులు గౌడ్, బోనాల శ్రీనివాస్, మడుపు మోహన్, మాజీ డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, కాంగ్రెస్ కార్పోరేటర్లు వరాల నరసింగం, ఆకుల నందిని ఉదయ్, టేల భూమయ్య, నాయకులు కంకణాల అనిల్ కుమార్, ఎస్.ఎ మోసీన్, అహ్మద్ అలీ, అబ్దుల్ రెహమాన్, వీర దేవేందర్ పటేల్, పెంట శేఖర్, గూడెపు సారంగ్ పాణి, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu