Karimnagar: కరీంనగర్ కలెక్టరేట్‌లో టీఎన్జీవోల సేవా దృక్పథం
Karimnagar: జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు జిల్లా కలెక్టర్ ఆద్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన జాబ్ మేళాలో పాల్గొన్న నిరుద్యోగుల కోసం టీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.
జిల్లా అడ్మినిస్ట్రేషన్ సూచన మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో దాదాపు 2500 మంది నిరుద్యోగులు పాల్గొన్నారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ చల్లని మజ్జిగను టీఎన్జీవోల సంఘం పక్షాన ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు దాహార్తి మరియు అలసటకు గురవుతున్న నేపథ్యంలో, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో అవసరమని తెలిపారు. ప్రజలకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఇలాంటి సేవ భాగ్యాం కల్పించిన జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా కి మరియు పరిపాలన యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. అదేవిధంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి విచ్చేసే ప్రజల కోసం కూడా టీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో నిరంతరం ఉచిత మజ్జిగ పంపిణీ కొనసాగుతున్నదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు మడిపల్లి కాళీ చరణ్ ఆర్డిఓ మహేశ్వర్ ఏవో సుధాకర్ తాసిల్దార్ నరేందర్ లక్ష్మీ నరసింహారావు జిల్లా కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర నాయకులు సర్దార్ హర్మిందర్ సింగ్ పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్ నాయకులు నారాయణ ఏవి రాజేశ్వరరావు చిరంజీవి నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం కార్యదర్శి శంకరయ్య పెన్షన్ల సంఘం అధ్యక్షుడు కేశవ మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.

